గయ్యాళి గంపలా మాట్లాడుతున్న మంత్రి రోజా దమ్ముంటే నగరి క్లాక్ టవర్ సెంటర్లో చర్చకు రావాలని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. జగన్ వద్ద మార్కులు కొట్టేయాలని ఆమె చంద్రబాబు, లోకేష్ లపై నిత్యం అవాకులు చెవాకులు పేలుతోందని విమర్శించారు. పేరు కోసం తమిళ సినిమా హీరో రజనీ కాంత్ మీద కూడా పరుష వ్యాఖ్యలు చేసిందని చెప్పారు.
రోజా గతం మరచి పోయి రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబుకు సవాళ్లు విసరడం విడ్డూరంగా ఉందని చెప్పారు. మాజీ ఎంపీ శివప్రసాద్ ఆమెను సినిమా రంగానికి ఆపై చంద్రబాబుకు పరిచయం చేసిన విషయం అందరికీ తెలుసని చెప్పారు. చంద్రబాబు ఆమెకు రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్ష పదవితో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే టిక్కెట్టు కూడా ఇచ్చారని తెలిపారు. తన ఎదుగుదలకు దోహదం చేసిన చంద్రబాబును తూలనాడటం తిన్నింటి వాసాలు లెక్కించిన చందంగా ఉందన్నారు.
తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి ప్రజలకు ఆమె చేసింది ఏమీ లేదన్నారు. తన భర్త,సోదరులను అడ్డం పెట్టుకొని అవినీతి సొమ్ము గడించి కోట్ల ఆస్తులు గడించిందని ఆరోపించారు.
ఎర్రచందనం స్మగ్లర్లు, ఇసుక మాఫియాతో చేతులు కలిపి కోట్లు కూడ బెట్టిందని విమర్శించారు. ఆమెకు నగరి, మదనపల్లి, పీలేరు, బెంగళూరు తమిళనాడులో కోట్ల విలువ చేసే బినామీ ఆస్తులు ఉన్నాయన్నారు. నగరి నియోజక వర్గంలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగా రెడ్డి వేయించిన రోడ్లు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన అభివృద్ది తప్ప ఆమె చేసింది ఏమీ లేదన్నారు.
రోజా ఎపిఐఐసి చైర్ పర్సన్ గా, పర్యాటక శాఖా మంత్రిగా జిల్లాలో ఒక మంచి పని చేయలేదన్నారు. రోజాకు దమ్ముంటే నగరి క్లాక్ టవర్ సెంటర్లో తనతో చర్చకు రావాలని సవాలు విసిరారు. ఆమె అవినీతి చిట్టా విప్పి నోటికి తాళం వేస్తానని సుధాకర్ రెడ్డి హెచ్చరించారు.
.

Discussion about this post