నితిన్’, ‘కీర్తి సురేష్ ల తొలి కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’ నుంచి రెండో పాటను విడుదల చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన మొదటి పాటకు కోటి కి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను వీడియో రూపంలో ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్. ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం అయిన ఈ ‘రంగ్ దే’ లో రెండోపాట వివరాల్లోకి వెళితే .
“సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే..
ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే
లవ్లీ గుండే కళలే.. లైఫే లేనిదాయే
స్మైలీ లాంటి ఫేసే…. స్మైలే లేనిదాయే”
అంటూ పాట సాగిపోతుంది. ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చగా గాయకుడు సాగర్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. నితిన్, కీర్తి సురేష్ లపై ఈ గీతాన్ని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి. నృత్య దర్శకుడు శేఖర్ భిన్నమైన నృత్య రీతులను సమకూర్చారు.
‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదలకు సిద్ధమౌతోంది. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, గీతాలు మరింత పెరిగేలా చేస్తున్నాయి.
ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.
#RangDeOn26thMarch @actor_nithiin @KeerthyOfficial @pcsreeram @dirvenky_atluri @vamsi84 @adityamusic
.