Warning: The magic method Post_Views_Counter::__wakeup() must have public visibility in /home/adarsini/public_html/wp-content/plugins/post-views-counter/post-views-counter.php on line 98
నో డౌట్.. ఈ తరం అన్నమయ్య! ఎలాగంటే..? – Adarsini
  • About Us
  • Contact Us
  • Our Team
Sunday, September 14, 2025
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

నో డౌట్.. ఈ తరం అన్నమయ్య! ఎలాగంటే..?

admin by admin
December 2, 2021
0
నో డౌట్.. ఈ తరం అన్నమయ్య! ఎలాగంటే..?

మూడువేలకు పైగా భావగర్భితమైన, పదసోయగాల సమ్మిళితమైన గీతాలతో.. సినీకళామతల్లిని అర్చించిన అద్భుతమైన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు. తెలుగు సినీ గేయ సాహిత్యానికి తీరని విషాదాన్ని మిగిలిస్తూ ఆయన సెలవు తీసుకున్నారు. భావోద్వేగాలను సిరాగా నింపుకున్న, తన బతుకు కలానికి విరామం ఇస్తూ ఆయన శివసాన్నిధ్యానికి చేరుకున్నారు.

‘‘సాగిన సాధన సార్ధకమందగ.. యోగ బలముగ యాగ ఫలముగ..  బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా..’’ (స్వర్ణకమలం) అంటూ సుదీర్ఘకాలం తెలుగు సినీగీత రచనలో చేసిన సాధన యావత్తూ సార్థకం కాగా.. యోగ బలంగా.. పాటల యజ్ఞఫలంగా.. బ్రతుకే ప్రణవనాదమై ప్రతిధ్వనించేలాగా.. అతులిత ప్రజ్ఞా ధురీణుడైన గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పరమపదం చేరుకున్నారు.

ఆయన రాసిన మూడువేలకుపైగా తెలుగు సినీ పాటలలో ఏవి మంచివి.. ఏవి అద్భుతమైనవి అంటే చెప్పడం చాలా చాలా కష్టం. కానీ ఒక్క పాటను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అలా ప్రస్తావించడానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో కెవి మహదేవన్ సంగీత నిర్దేశకత్వంలో రూపొందిన శ్రుతిలయలు చిత్రం కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాటరాశారు.

also read : అఖండ.. ఒక ప్రళయం ! Balakrishna Movie Review

మామూలుగానే.. దర్శకుడిగా విశ్వనాధ్‌కు, గీతరచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఒక గొప్ప అనుబంధం ఉంది. ఆ చిత్రంలో పాట వచ్చే సందర్భాన్ని సిరివెన్నెల కు వివరించిన తర్వాత.. ఆ పాటను మంగళంపల్లి బాలమురళీకృష్ణ తో పాడించబోతున్నట్లుగా కూడా విశ్వనాధ్ ముందే సిరివెన్నెలకు చెప్పారట.

also read : విరివెన్నెల : ఆశలు విత్తి.. జీవితాలను మొలకెత్తించి..

మంగళంపల్లి పాడుతున్నారంటే.. ఆ పాటకూడా ఆయన స్థాయికి తగ్గట్టుగా గొప్పగా ఉండాలని సిరివెన్నెల అనుకున్నారు. మంగళంపల్లి అన్నమయ్య కీర్తనలను ఎంతో ఇష్టంగా పాడుతుంటారు కాబట్టి.. ఆ తరహాలోనే.. అన్నమయ్య కీర్తనల తీరులోనే పాట రాయాలని అనుకున్నారు. ఫలితంగా వచ్చిన పాట ‘తెలవారదేమో స్వామీ..’!

రికార్డింగులో తమాషా

సిరివెన్నెల పాట రాయడం పూర్తయింది. అనుకున్నట్టే అన్నమయ్య కీర్తనలాగా రాశారు. కానీ.. అనుకోకుండా మరో సంఘటన జరిగింది. పాట రికార్డింగు కూడా పెట్టేసుకున్న తర్వాత.. చివరి నిమిషంలో ఆ పాట పాడవలసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ రాలేకపోయారు. రికార్డింగ్ ఆరోజే చేయించాలి. ఆ పరిస్థితుల్లో అదే సమయంలో స్టుడియోకు వేరే పనిగా వచ్చి ఉన్న కె.జె. యేసుదాస్ ను ఆ పాట పాడాల్సిందిగా మహదేవన్ అడిగారు. యేసుదాస్ అందుకు ఒప్పుకున్నారు. ‘తెలవారదేమో స్వామీ.. నీ.. తలపుల మునుకలో..’ అంటూ సాగే ఆ పాట యేసుదాస్ అమృతస్వరంలో రూపుదిద్దుకుంది.

also read : హృదయాన్ని కదిలించే ‘వెన్నెల సిరి’

రికార్డింగ్ పూర్తయిన తర్వాత.. ఆ పాట సాహిత్యం తాను తీసుకుంటానని.. యేసుదాస్ దానిని పట్టుకెళ్లారు. అది అదివరలో తాను ఎన్నడూ విని ఎరగని అన్నమయ్య కీర్తన అని, చాలా గొప్పగా ఉన్నదని యేసుదాస్ అనుకున్నారు. ఆయనను పాట పాడమని మహదేవన్ అడిగారే తప్ప.. రచయిత ఎవరో చెప్పనూలేదు, ఆయన అడగనూ లేదు. పాట చూసి.. అన్నమయ్య కీర్తనే అనుకున్నారు.!

also read : అక్షరాల దారుల్లో -3 : సిరివెన్నెల స్మృతులు

అప్పటినుంచి యేసుదాస్ ఎక్కడ కచేరీలు చేసినా.. ఓ సందర్భంలో అన్నమయ్య కీర్తన అని చెప్పి.. ఈ పాట పాడుతుండేవారు. చాలా కాలం తర్వాత.. ఆయనకు అసలు విషయం తెలిసింది. ఈ పాట రాసింది అన్నమయ్య కాదు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి అని! అంతగా తనే అన్నమయ్య అనిపించేలా.. సీతారామశాస్త్రి రాసిన, అన్నమయ్య పాటల్లోని తేటతెలుగు పదాలను పొదవుకున్న అద్భుతమైన పాట అది. ఆ పాట అన్నమయ్య కీర్తన అనే భ్రమ అంతటితో అయిపోలేదు.

నంది అవార్డుకు పక్కన పెట్టారు..

ఆ ఏడాది శ్రుతిలయలు చిత్రాన్ని ఏకంగా ఎనిమిది నంది అవార్డులు వరించాయి. ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు, ఉత్తమ దర్శకుడుగా విశ్వనాధ్, ఉత్తమ నటిగా సుమలత, ఉత్తమ సంగీత దర్శకుడుగా మహదేవన్, ఉత్తమ బాలనటుడిగా షణ్ముఖ శ్రీనివాస్, ఉత్తమ ఆడియోగ్రాఫర్‌గా ఎఆర్ స్వామినాధన్, ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా కెవి సత్యానారాయణ, ఉత్తమ గీతరచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి అవార్డులు అందుకున్నారు.

also read : అమెరికా ‘మనబడి’లో మహామనీషి శాస్త్రి గారు!

సీతారామశాస్త్రికి ఆ నంది అవార్డు అంత ఈజీగా రాలేదు. ‘తెలవారదేమో స్వామీ..’ పాటకోసమే నంది అవార్డుకు దరఖాస్తు చేశారు. అయితే జ్యూరీలోని న్యాయనిర్ణేతలు ఆ పాటను పక్కన పెట్టేశారు. అది అన్నమయ్య కీర్తన అని.. దానిని అన్నమయ్య రాశారని వారు అనుకున్నారు. పొరబాటుగా ఆ పాటను నంది అవార్డుకోసం దరఖాస్తు చేశారని భావించారు. అలా పక్కన పెట్టిన సంగతి ఎలాగో బయటకు వచ్చింది. సంగతి తెలిసినవాళ్లు జ్యూరీకి తెలియజెప్పారు. ఇది సిరివెన్నెల రాశారని వారికి అప్పటికి గానీ అర్థం కాలేదు. అలా, ఆ తర్వాత సిరివెన్నెలకు ఉత్తమ గీత రచయిత అవార్డు వచ్చింది.

మరో పదనిస..

ఈటీవీ ప్రారంభమైన తొలిరోజుల్లో ‘సరాగాలు’ పేరిట పాటలు ప్రసారం చేస్తుండేవాళ్లు. శ్రుతిలయలు చిత్రంకోసం సిరివెన్నెల రాసిన ఈ పాట ఉదయపు సౌందర్యాత్మక అనుభూతిని ప్రతిబింబించేది కావడంతో.. చాలా సార్లు ఉదయంపూట ఈ పాట ఈటీవీ ‘సరాగాలు’ కార్యక్రమంలో ప్రసారం అయ్యేది. అయితే.. పాటవేసిన ప్రతిసారీ ‘గీతరచయిత : అన్నమయ్య’ అని వేసేవారు. ఈటీవీ బృందానికి  కూడా ఈ పాట అసలురచయిత ఎవ్వరో తెలియదు. చాలా కాలానికి తప్పు తెలుసుకుని.. తర్వాత సిరివెన్నెల పేరు వేయడం ప్రారంభించారు.

also read : విధాత తలపున ప్రభవించిన వాడు..

ఆ రకంగా… గీతరచయితగా తన అస్తిత్వమే లుప్తమైపోగా.. పాట అడుగడుగునా.. పదపదమునా.. అన్నమయ్యను ప్రతిష్ఠించి.. ఆలకించిన ప్రతిమదిలో అన్నమయ్యే ఊహల్లో మెదిలేలా రాసిన మహారచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.

also read : పాటతో మమేకమైన తత్వవేత్త.. సిరివెన్నెల

ఆ పాటలో.. అన్నమయ్య కీర్తనల్లో దొర్లే తేటతెలుగు పదాలు మనకు నిండుగా కనిపిస్తాయి. కేవలం పదాలు మాత్రమే కాదు, వాటి అల్లిక, ఆ అల్లిక నడుమ దొర్లిన ఒక సుతారమైన చిలిపితనం ఆ పాటలో ఉంటుంది. మహదేవన్ బాణీలలో.. కెజె యేసుదాస్ స్వరంలో ఆ పదగాంభీర్యం, తేటతెలుగు పదాల సోయగం, చిలిపి ఊహల పరిమళం అన్నీ అద్భుతంగా అమరి.. అమృతప్రాయమైన, శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న అనేక తెలుగు సినిమాపాటలలో ఒకటిగా.. ‘తెలవారదేమో స్వామీ..’ కి స్థానం దక్కింది.

సిరివెన్నెల లేని లోటు తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నటికీ తీరదు. తెలుగు సినిమా పాట సోయగాన్ని మరచి, భావగాంభీర్యాన్ని విస్మరించి.. కొత్తపుంతలు తొక్కుతున్న ముసుగులో వింతవక్రతలను ఆలింగనం చేసుకుంటున్న సీతారామశాస్త్రి నిష్క్రమణం.. నిజంగానే అతిపెద్దలోటు!

సీతారామశాస్త్రి మరణం పట్ల ఆదర్శిని డాట్ కామ్ సంతాపం వ్యక్తం చేస్తోంది.

.. సురేష్ పిళ్లె
సంపాదకుడు

Also Read
పాపం జగన్.. అహం చంపుకున్నా ఫలం దక్కలేదు

ఆ పాట సాహిత్యం ఓసారి గమనిద్దాం..

‘‘తెలవారదేమో స్వామీ..
తెలవారదేమో స్వామీ.. నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ..
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై అలసిన దేవేరి,
అలసిన దేవేరి అలమేలు మంగకూ ..

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ
మరి మరి తలచగ

అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ గ మ ప ని
తెలవారదేమో
స ని ద ప మ ప మ గ ని స గ మ
తెలవారదేమో స్వామి
ప ని ద ప మ గ మప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి స రి ని స
తెలవారదేమో స్వామీ..’’

చిత్రం : శ్రుతిలయలు (1987)
గానం : సుశీల, కె.జె.యేసుదాస్ సంగీతం : కెవి మహదేవన్ దర్శకత్వం : కె విశ్వనాధ్

పాటతో మమేకమైన తత్వవేత్త.. సిరివెన్నెల

విధాత తలపున ప్రభవించిన వాడు..

అమెరికా ‘మనబడి’లో మహామనీషి శాస్త్రి గారు!

అక్షరాల దారుల్లో -3 : సిరివెన్నెల స్మృతులు

విరివెన్నెల : ఆశలు విత్తి.. జీవితాలను మొలకెత్తించి..

హృదయాన్ని కదిలించే ‘వెన్నెల సిరి’

నో డౌట్.. ఈ తరం అన్నమయ్య! ఎలాగంటే..?

సీతారామశాస్త్రి తెలుగు సినీపాట సాధించుకున్న పురస్కారం : చంద్రసిద్ధార్థ్

సిరివెన్నెల : ఈ రాత్రికి మార్చురీలోనే.. రేపు అంత్యక్రియలు

సినీ గీత రచయిత సిరివెన్నెల కన్నుమూత

Tags: annamayyaeditor suresh pillaik viswanathkj yesudaskv mahadevanmangalampalli balamurali krishnarajasekharseetarama sastrysirivennela no moresirivennela seetarama sastrysumalathasuresh pillaisuseela

Discussion about this post

Top Read Stories

No Content Available

VIDEO

https://youtu.be/qecT2wF60XU
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!