ఒక రాత్రి.. పది కథలు.. ఒకటే సినిమా ప్లే!

184

ప్లే అనేది ఒక సినిమా. కానీ ఇందులో పది కథలుంటాయి. అన్నీ ఒకే రాత్రిలో జరుగుతాయి. మోక్ష్ దర్శకత్వంలో రాజ సులోచన నిర్మించిన ఈ ప్లే 28న విడుదల కు సిద్ధమవుతోంది. ప్లే అనేది డిఫరెంట్ సినిమా, ఒక రాత్రి జరిగిన కథ ఇది అని దర్శకుడు మోక్ష్ అంటున్నారు. విడుదల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హీరో అభినవ్ సింగ్  మాట్లాడుతూ నాకు ఇది మొదటి సినిమా, ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది. డైరెక్టర్ గారు సినిమాను ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది అని చెప్పారు.

ఆర్టిస్ట్ జగదీష్ మాట్లాడుతూ… హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుంది. డైరెక్టర్ ఎనర్జీ మమ్మల్ని నడిపించింది. అందరితో బెస్ట్ ఔట్ ఫుట్ రాబట్టుకున్నారు, రిస్కీ షార్ట్స్ ను కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఆడియన్స్ మా సినిమా చూసి కొత్త అనుభూతిని పొందుతారని తెలిపారు.

తెలుగు వెండితెరపై ప్రయోగాలు మామూలే. సినిమా మొత్తం ఒక రాత్రిలో జరిగిపోయే కథాంశాన్ని ఎంచుకోవడం అనేది ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ పెరగకుండా తీసుకున్న జాగ్రత్త కావచ్చు గానీ.. ఆ పరిమితులు ఎలా ఉన్నప్పటికీ.. కథ కథనం నాణ్యంగా ఉంటే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Facebook Comments