భారీవర్షాల కారణంగా జలకళ వెల్లువెత్తడంతో.. చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రభావం ఇదని జేజేలు పలుకుతున్నారు. జలకళతో అలరారుతున్న చెరువులకు పూజలు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల ప్రజలు నిత్యం కరవుతో అవస్థలు పడుతుంటారు. అలాంటి వారికి ప్రస్తుత వర్షాలు ఊరట కలిగిస్తున్నాయి.
బైరెడ్డిపల్లి మండలం బెలుపల్లి గ్రామానికి చెందిన పాతచెరువు నిండి మర వలుపోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గంగమ్మ తల్లికి పూజలు చేసారు.
బేలు పల్లి సర్పంచ్ వెంకటేష్, ఎంపీటీసీ బాబు మాట్లాడుతూ
పాత చెరువు 33 సంవత్సరాల తర్వాత నిండడం తో పూజా కార్యక్రమములు చేసి ఆనందం వ్యక్తం చేశారు బెల్లం మడుగు చిక్క నపల్లి చేనగానపల్లి కంచన పల్లి కూర్ మై కేట్ ఎలా ఫామ్ నక్కపల్లి అన్ని చెరువులు నిండి మరవలు పోతున్నాయి
దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాగుండమేనని అతని పాలనకు భగవదనుగ్రహం ఉందని బేలుపల్లి సర్పంచ్ వెంకటేష్ చెప్పారు.
.