తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన శనివారం వేడుకగా గ్రంథి పవిత్ర సమర్పణ జరిగింది. ఇందులో భాగంగా ఉదయం యాగశాల పూజ, హోమం, లఘు పూర్ణాహుతి, గ్రంథి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం యాగశాలపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల కోసం రూ.లక్ష విరాళం
ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలకు గాను తిరుపతిలోని రష్ హాస్పిటల్ అధినేత, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ కె.సుబ్బరాజు, కంకణభట్టార్ ఉదయకుమార్ గురుకుల్, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Discussion about this post