మన వారసత్వ సంపదని… ఈ భాషను భావి తరాలకు తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ సాహితీవేత్త చీకోలు సుందరయ్య అన్నారు.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుచ్చినాయుడుకండ్రిగ మండలం కల్లివెట్టు ఉన్నత పాఠశాలలో సోమవారం తెలుగు భాషాపండితులు యువశ్రీ మురళి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు రమణయ్య అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా సాహితీవేత్త చీకోలు సుందరయ్య, భాషాభిమాని లక్ష్మీ ప్రసాద్ లు హాజరై మాతృభాష ఆవశ్యకత, విశిష్టత, ప్రయోజనం గురించి విద్యార్థులకు వివరించారు.
అనంతరం భాషాపోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే విలువైన కథలు పుస్తకాలు. పెద్ద బాలశిక్ష, శతక పద్యాలు బహుమతులుగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఒబ్బు ప్రసాద్, నాదెండ్ల మురళి, దాసు, సురేష్ బాబు, వేణుగోపాల్, మోహన్ బాబు, జయసుధ, వాణి, రామక్క తదితరులు పాల్గొన్నారు.
.