ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ S.S.రావత్, ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.రవి సుబాష్ తో కలిసి మంగళవారం సాయంత్రం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రస్తుత అభివృద్ధి, స్థితిగతులను వారికి వివరించారు.
శ్రీసిటీ ప్రారంభ దశలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా శ్రీసిటీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రావత్, అతి తక్కువ వ్యవధిలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో ప్రపంచవ్యాప్తంగా 200 ప్రతిష్టాత్మక పరిశ్రమలు ఏర్పాటు కావడాన్ని ప్రశంసించారు.
శ్రీసిటీని దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయడంలో మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారి బృందం యొక్క కృషిని ఆయన అభినందించారు.
శ్రీసిటీని సందర్శించినందుకు రావత్‌కు కృతజ్ఞతలు తెలిపిన రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీని ప్రపంచ స్థాయి పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఆయన ప్రోత్సాహం, మద్దతు చాలా ముఖ్యమైనవిగా తన ప్రకటనలో పేర్కొన్నారు.
కోవిడ్ సమయంలో ఆయన మార్గదర్శకత్వం తమ వ్యాపారాన్నిత్వరగా పునః ప్రారంభించడంలో సహాయపడిందన్నారు.
.

Discussion about this post