గత పది రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వర్షానికి చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలో పలు చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ముఖ్యంగా ఓబులురాజుల కండ్రిగ, నాగలాపురం మధ్య ఉన్న చెంగల్వ కల్వర్టు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది.
దీంతో ప్రధాన మార్గం గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి… దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు బీరేంద్ర రాజు వెంటనే చర్యలు తీసుకొని యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో బీరేంద్ర స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి బుధవారం ఉదయం కల్వర్ట్ కు తాత్కాలిక మరమ్మతులు చేయించారు.. త్వరలోనే శాశ్వత కల్వర్టును నిర్మిస్తామని చెప్పుకొచ్చారు.
దీంతో ఇప్పటికే 10 రోజులుగా రాకపోకలు నిలిచిపోయిన ఈ మార్గంలో ఇప్పుడు వాహనాల సందడి నెలకొంది, పరిశ్రమలలో విధులకు వెళ్లేవారికి, ఊరి ప్రయాణాలు చేసేవారికి ఉన్న ఇబ్బందులు తొలగిపోవడంతో మార్గాన్ని సుగమం చేసిన రాజు పై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు..!
.

Discussion about this post