చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు .గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం స్థానిక గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ జీవన్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ జరిగింది.
‘ఆదర్శ జాతీయ నేతలు’ అంశంపై జరిగిన వ్యాసరచన పోటీలలో 40 మంది విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ రికార్డ్ అసిస్టెంట్ జీవన్ మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగానే పుస్తక ప్రదర్శన, వ్యాసరచన పోటీలు వంటివి నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. చదువుకుంటున్న ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి రావడం ద్వారా వారి విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కార్తీక్, దీన, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post