సత్యవేడు ప్రొహిబిషన్ ఎక్సయిజ్ అధికారుల చిత్రమైన తీరు ఇది. వారి ఆఫీసు ఓ అద్దె భవనంలో నడుస్తోంది. ఆ భవనానికి చాలా కాలంగా అద్దె బకాయిలు పెండింగు ఉన్నారు. భవన యజమాని ఖాళీ చేయమంటే పట్టించుకోవడం లేదు. పైగా వారిని బెదిరిస్తున్నారని ఆరోపణ. ఇది కాస్తా.. వాళ్లు ఆత్మహత్యకు పాల్పడతాం అని హెచ్చరించే దాకా వచ్చింది.
అద్దెకిచ్చిన తన భవనాన్ని ఖాళీ చేయకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం రాజగోపాలపురం మహిళ శ్యామల ఆందోళన చేసింది. అద్దెకిచ్చిన తన భవనాన్ని ఖాళీ చేయాలంటూ సోమవారం సత్యవేడు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం వద్ద బాధితురాలు పెట్రోల్ సీసాతో ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా బాధితురాలు శ్యామల భర్త షణ్ముఖం మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితమే ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయం నడపటానికి తన సతీమణి శ్యామల పేరుతో ఉన్న భవనాన్ని అద్దెకు ఇచ్చామన్నారు. ఈ నేపథ్యంలో భవనపు గోడలు, స్లాబ్ పలుచోట్ల బీటలు వారడంతో వర్షానికి లీకేజీలు అవుతున్నట్టు ఆయన చెప్పారు.
ఈ క్రమంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి భవనాన్ని ఖాళీ చేయాలని 2019 ఆగస్టు లోని అప్పటి ఎక్సైజ్ అధికారులకు రాతపూర్వకంగా వినతి అందించామన్నారు. అయితే అప్పటి నుంచి ఖాళీ చేయకుండానే ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం తమ భవనంలోని కొనసాగుతున్నట్టు ఆయన ఆరోపించారు.
పైగా అద్దె కూడా ఇప్పటివరకు 22 నెలల పాటు లక్షా అరవై ఆరు వేల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందన్నారు. అద్దె చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలంటూ పలుమార్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. దీంతో వేరే మార్గం లేక తాము ఆందోళనకు దిగవలసి వచ్చిందన్నారు.
అంతకుమునుపు ఎన్ ఫోర్స్మెంట్ కార్యాలయం వద్ద బాధిత వర్గాలు బైఠాయించి అద్దె చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు . అనంతరం దీనిపై వినతిపత్రం ఇచ్చేందుకు బాధిత వర్గాలు కార్యాలయంలోకి వెళ్లగా ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వరరావు ఆవేశంతో ఊగిపోయి అద్దెకిచ్చిన భవనపు యజమానిపైనే దురుసుగా ప్రవర్తించడం బాధిత వర్గాలు జీర్ణించుకోలేకపోయారు.
also read : బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?
అయితే ఆందోళన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దీనిపై ఇటు బాధిత వర్గాలతో అటు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర రావుతో చర్చించారు . అయితే అద్దెకు సంబంధించి 2023 వరకు గడువు ఉన్నట్టు లీజు పత్రాలను సీఐ విశ్వేశ్వరరావు బయటపెట్టారు. దీనిపై బాధితురాలు ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తీరుపై ఆగ్రహావేశాలతో ఊగిపోయారు.
also read : ‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు
నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని లీజు గడువు పొడిగింపుపై సంతకాలు తీసుకొని మోసం చేసినట్టు బాధితురాలు శ్యామల భర్త షణ్ముఖం కార్యాలయం వద్ద తన తల నోటిఫై కొట్టుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో బాధిత వర్గాలు కొందరు సముదాయించి కార్యాలయం నుంచి తీసుకెళ్లారు .ఈ ఆందోళన కార్యక్రమంలో బాధిత వర్గాలు హేమంత్ కుమార్, భాస్కర్, పార్వతి, నందకుమార్ తదితరులు పాల్గొన్నారు .
also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..
	    	
.
    	
		    
Discussion about this post