ఇటీవల కురిసిన తుఫానుకు రైతులు వ్యవసాయ కూలీలు నష్టపోయారని తక్షణo వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ డిమాండ్ చేశారు.
నాగలాపురం మండలం లోని కొట్టకాడు,వేంబాకం,కృష్ణాపురం, గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పొలాలును, సుందరయ్య నగర్ లోని నివాస గృహాలను ఏపీ రైతు సంఘము పార్టీ బృందం సోమవారం పరిశీలించారు.
ఈసందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్దన్ మాట్లాడుతూ,పంట పొలాలు జలమయమయ్యాయి అని తెలిపారు. అందువల్ల వరిపైరు, తీవ్రంగా దెబ్బతిందని దీంతో రైతు లు నష్టపోయిన పంటకు ఓక ఎకరాకి రూ’10వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన గల సుందరయ్య నగర్ లో నివాసం ఉన్న దళితు లు ,గిరిజనులు ,పేదలు గుడిసెలు లో వర్షపు నీరు చేరి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు
ఒక్క రెవెన్యూ అధికారి కూడా కన్నెత్తి చూడలేదని విమర్శించారు. ఇక్కడ ఉన్న 50కుటుంబాలకు ప్రతిఇంటికి 10వేల రూపాయలు, మరియు 50కేజీ ల బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు ఉచితంగాఇవ్వాలని డిమాండ్ చేశారు.
డిమాండ్లు తో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ ప్రసన్నకుమార్ కు అందజేశారు కార్యక్రమంలో సిపిఎం మoడలకార్యదర్శి ఆర్ మురుగేషన్,మండల మహిళా కార్యదర్శి అమ్ముద,తదితరులు పాల్గొన్నారు.
.
.