సత్యవేడు లో ఇదీ సంగతి. ఆక్రమణలకు అరాచకాలకు ఎవ్వరూ వెరవడం లేదు. భయపడడం లేదు. ఎవరో ఒకరి అండ చూసుకుని.. యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు.
సత్యవేడు పోలీస్ స్టేషన్ కు కూత వేటు లో ఉన్న ప్రభుత్వ గ్రామ చావడి స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారు
రాత్రికి రాత్రే ఏకంగా ఈ భూములు తమవే అంటూ గోడలు నిర్మిస్తున్నారు.
పట్టణ నడి బోడ్డున సుమారు అర్ధ కోటి విలువ చేసే భూములు ఆక్రమిస్తున్నా పట్టించుకునే వారు లేరని సత్యవేడు పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించు కోవడానికి ప్రయత్నాలు చేశారు అప్పట్లో అధికారులు వెంటనే అక్కడ బోర్డులను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల్లో అడుగు పెడితే కేసులు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుతం ఉన్న అధికారులు కదలిక లేకుండా ఉన్నారని సత్యవేడు పట్టణ ప్రజలు చెబుతున్నారు. తమ శాఖ కు చెందిన భూములకే రక్షణ కల్పించక రెవెన్యూ అధికారులు నిస్తేజంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
	    	
.
    	
		    
Discussion about this post