చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిషత్ అటెండరుగా పనిచేస్తున్న అరుణ మృతికి స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నివాళులర్పించారు.
సోమవారం ఆయన- ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ తో కలిసి సత్యవేడు పట్టణంలో బీసీ కాలనీకి చేరుకుని అరుణ మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అరుణ దహన సంస్కారాలు నిమిత్తం 25 వేల రూపాయలను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఇందులో ప్రభుత్వం తరఫున 15 వేల రూపాయలు. ఎమ్మెల్యే వ్యక్తిగతంగా మరో పదివేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది.
మృతి చెందిన అరుణ కుటుంబ సభ్యులకు అన్ని విధాల సహాయక సహకారాలు అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేంద్రనాథ్, దాసుకుప్పం గ్రామ సర్పంచ్ రవి రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నేతలు సెంథిల్ కుమార్, వంశీ రెడ్డి, మండల పరిషత్ అధికారులు శివయ్య, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
.

Discussion about this post