• About Us
  • Contact Us
  • Our Team
Sunday, September 20, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

satyavedu news సచివాలయంలో సిబ్బంది ఏరీ ఎక్కడ?

స్థానిక ప్రజాప్రతినిధుల పరిశీలనలో బట్టబయలు

admin by admin
November 17, 2021
0
satyavedu news సచివాలయంలో సిబ్బంది ఏరీ ఎక్కడ?

ప్రజాప్రతినిధులు నిఘానేత్రం తెరిస్తే.. అధికారులు గాడిలో ఉండి పనిచేయాల్సిందే. పని ముసుగులో డుమ్మా కొట్టడానికి, ఇచ్చమొచ్చినట్లుగా వ్యవహరించడానికి కుదరదు. ఆ విషయాన్నే సత్యవేడు ప్రజాప్రతినిధులు నిరూపించారు. అధికారుల, సిబ్బంది పనితీరు మీద ఆకస్మిక తనిఖీలతో దారిలో పెట్టగలం అని చేసిచూపారు.

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పౌర సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామసచివాలయాల లో సిబ్బంది పనితీరు గాడి తప్పుతోంది. సచివాలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది సకాలానికి విధులకు హాజరు కాని పరిస్థితి నెలకొంటోంది.

ఇందులో భాగంగానే బుధవారం చిత్తూరు జిల్లా సత్యవేడు ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జెడ్ పి టి సి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి తదితరులు ఎంపీడీవో సురేంద్ర నాథ్ సమక్షంలో మండల పరిధిలోని ఇరుగులం గ్రామసచివాలయ ఆకస్మిక తనిఖీలో ఇది బట్టబయలయ్యాయి.

ఉదయం 11 గంటలు దాటినా సంబంధిత విఆర్వో నీరేష్ కుమార్, విద్యుత్ శాఖ జెఎల్ఎం క్రాంతికుమార్ విధులకు హాజరు కాకపోవడాన్ని గుర్తించారు. కనీసం మూమెంట్ రికార్డులలో నమోదు చేయకపోవడం పట్ల ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పంచాయతీ సెక్రెటరీ ప్రకాష్ ను ప్రశ్నించారు.

సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మూమెంట్ రికార్డులో నమోదు చేయాలని ఎంపీడీవో సురేంద్రనాథ్ స్పష్టం చేశారు. తదనంతరం నవరత్నాలలో భాగంగా ఇరుగు లం గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల వివరాలను సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ సాయికుమార్ వివరించారు.

ఇందులో భాగంగానే వైయస్సార్ ఆసరా 139 మందికి , చేదోడు ఐదు మందికి ,నేస్తం పథకంలో 70 మంది లబ్ధి పొందుతున్నటు పేర్కొన్నారు . అయితే వైయస్సార్ చేదోడు పథకంలో అర్హులైన నిరుపేదలు ఉన్నందువల్ల వారిని గుర్తించాలని ఎంపీపీ కోరారు.

దీంతోపాటు గ్రామంలో మంజూరైన 168 పక్కా గృహాలు సంబంధించి ఇప్పటివరకు 20 బిల్లులో పది మంది లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులు మంజూరు అయినట్టు సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సురేష్ పేర్కొన్నారు.

ఇదేగాక గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో గ్రామ సచివాలయ భవన నిర్మాణం ,21 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మాణదశలో ఉన్నట్టు స్పష్టం చేశారు .అయితే వైయస్సార్ గ్రామీణ ఆరోగ్య చికిత్సాలయం ,మహిళ పాల ఉత్పత్తిదారుల సహకార భవనం ,వైయస్సార్ లైబ్రరీ భవన నిర్మాణాలు వారం రోజుల్లోపు ప్రారంభించాలని ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతిమ సునీల్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను కోరారు .గ్రామంలోని ప్రభుత్వ భూములు వాటి సర్వే నెంబర్తో సహా వివరాలను నివేదిక ద్వారా అందించాలని సర్వేయర్ షణ్ముగంకు సూచించారు.

అలాగే గ్రామనత్తం సంబంధించి సర్వేకు దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన సర్వే చేయించి ఇంటి స్థలాలు వారి హద్దులుతోపాటు చూపించాలన్నారు . ఉపాధి హామీ పథకంలో స్మశాన వాటికలకు దారి వసతి ,చెట్టు తొలగింపు చేపట్టాలని స్థానిక ప్రజా ప్రతినిధులు ఉపాధి ఏపీవో భాస్కర్అయ్యాను కోరారు .అలాగే ఇరుగులం మెట్ట ఇండ్ల కాలనీ వద్ద కాల్వలను పూడికతీత పనులు చేపట్టి వర్షపు నీరు సజావుగా సాగేలా చూడాలన్నారు.

తదనంతరం ప్రజలకు అందుతున్న పౌర సేవలపై జెడ్పిటిసి విజయలక్ష్మి సుశీల్ కుమార్ రెడ్డి ఆరా తీశారు . గ్రామాల్లో ఆరోగ్య సేవలుపై చిన్నపాండురు ప్రాథమిక వైద్య కేంద్ర అధికారిని డాక్టర్ అనిత వివరించారు . గర్భవతులు ,శిశువుల తల్లులకు క్షేత్రస్థాయి హెల్త్ క్లినిక్ లో ఏఎన్ఎం ద్వారా వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు . ఆదాయం ,కులం నివాస ధ్రువీకరణ పత్రాలను వారం రోజుల్లోపు ఇస్తున్నట్టు విఆర్వో నిరీష్ కుమార్ చెప్పారు.

అయితే సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలన్నారు ఇకపై సచివాలయానికి సకాలంలో హాజరు కాని సిబ్బందిపై చర్యలు తప్పవని జడ్పిటిసి హెచ్చరించారు .అనంతరం సచివాలయ సందర్శనలో భాగంగా గృహ నిర్మాణాలకు సంబంధించి పలువురికి అనుభవ స్థల ధ్రువీకరణ పత్రాలను ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శేఖర్ ,కోల్లడం సర్పంచ్ చెంచయ్య ,సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ రామ్ ప్రతాప్ ,ఏఎన్ఎం శ్రీజ ,పలువురు గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు .

Tags: locallocal topSatyavedu localsatyavedu newssatyavedu updatesసత్యవేడు అప్‌డేట్స్సత్యవేడు న్యూస్సత్యవేడు వార్తలుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

16 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply