తెలంగాణ కాంగ్రెస్ ఈసారి కూడా కుటుంబానికి ఒక ఎమ్మెల్యే టికెట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఆ రకంగా పార్టీలో అందరూ సమానులే అని చెప్పే సంకేతాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తాను ఆచరించలేని సిద్ధాంతాలను ప్రవచిచండం కొత్త సంగతి ఎంతమాత్రమూ కాదు. కేసీఆర్ ది కుటుంబ పాలన అంటున్నారు గనుక.. ఆ రకంగా తమ మీద విమర్శలు రాకుండా.. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అంటున్నారు.
ఈ సిద్ధాంత ప్రకారం కాంగ్రెస్ లో అందరూ సమానులే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ‘‘ఆల్ ఆర్ ఈక్వల్.. సమ్ ఆర్ మోర్ ఈక్వల్’’ అంటూ ప్రజాస్వామ్యానికి ఉండే వెటకారపు నిర్వచనంలాగా.. కాంగ్రెస్ పార్టీలో కూడా అధిక సమానులు కొందరు ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ సిద్ధాంతాన్ని సడలించిన కొందరికి, ఈసారి కూడా సడలిస్తారట.
అంటే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆయన భార్యకు మాత్రం జమిలిగా రెండు టికెట్లు దక్కుతాయన్నమాట. అన్నదమ్ములిద్దరూ పోటీచేయాలనుకుంటున్న కోమటిరెడ్డి బ్రదర్స్ గానీ, తమ కుటుంబంనుంచి తనతోపాటు, భర్త, కూతురు కూడా మూడుస్థానాల్లో పోటీచేయాలని అనుకుంటున్న కొండా సురేఖ కు గానీ.. చాన్స్ దక్కదన్నమాట.
చూడబోతే ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా కాంగ్రెస్ తీరు మారదని అనిపిస్తోంది.
.

Discussion about this post