కార్తీక శుద్ధ అష్టమి నాడు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా గోపూజ నిర్వహించారు. ఈ రోజున గోపాష్టమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు. ఆ మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలోని సప్త గోకులములో శుక్రవారం ఉదయము తొమ్మిది గంటలకు, విశేష గోపూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు దంపతులు, దేవస్థానం ఏఈఓ ధనపాల్ పర్యవేక్షకులు నాగభూషణం, విజయ సారథి, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది ,భక్తులు పాల్గొన్నారు
.

Discussion about this post