కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని తమ పార్టీలో చేర్చేసుకోవడానికి వారు బహుధా ప్రయత్నించారు. ఆయన కమలతీర్థం పుచ్చకున్నట్లే అనే మైండ్ గేమ్ తో లోబరుచుకోబడానికి ప్రయత్నించిన బీజేపీ పాచిక పారలేదు. ఆయన స్థిరంగా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తాజాగా.. తెలంగాణలో కమల దళం హవా నడుస్తూనే ఉన్నదని నిరూపించుకోవాలంటే.. సాగర్ కూడా గెలవాల్సిందేనని, గెలవాలంటే ఏం చేయాలనే విషయంలో కసరత్తు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో నాగార్జున సాగర్ ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్లగొండ జిల్లా, సాగర్ ముఖ్య నేతలు, ఆశావహులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో పార్టీ గెలుపుతో టికెట్ కోసం భారీ పోటీ నెలకొని ఉంది. బీజేపీ అభ్యర్థిత్వం ఎవరికి దక్కుతందనే విషయం తేలలేదు.
బండి సంజయ్ క్షేత్ర స్థాయి పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. బీజేపీ సాగర్ ఎన్నికల ఇంచార్జ్ గా సంకినేనిని నియమించారు. సాగర్ లో ఎవరికి వారు తామే అభ్యర్థి అన్నట్లుగా ప్రచారం చేసుకోవడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశం రసాభాస
సాగర్ నేతలు మాట వినకుండా తమ ఇష్టమొచ్చిన రీతిగా ప్రవర్తిస్తుండడంతో విసిగిపోయిన పార్టీ సీనియర్ నాయకుడు తరుణ్ చుగ్ మధ్యలోనే వెనుతిరిగివెళ్లిపోయారు. పలువురు నేతలు తీరు మార్చుకోవాలని హితవు చెప్పారు.
పార్టీ లైన్ దాటితే చర్యలకు ఉపేక్షించేది లేదని స్థానిక నాయకులను బండి సంజయ్ హెచ్చరించడం విశేషం. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేసుకోవాలని సూచించారు. అయితే.. ప్రస్తుత వాతావరణాన్ని గమనిస్తే టికెట్ ఎవరికి వచ్చినప్పటికీ.. పార్టీలో అసంతృప్తులు లుకలుకలు తప్పేలా కనిపించడం లేదు.
.

Discussion about this post