మహిళల అభ్యున్నతే జగనన్న లక్ష్యమని వైసీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు, శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ ఫ్లోర్ లీడరు, ఆప్కో మాజీ డైరెక్టరు మిద్దెల హరి అన్నారు.
మహిళా సంఘాల వారికి మూడవ విడత వైఎస్సార్ సున్నా వడ్డీ సొమ్ము వారి ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం జమ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలలోని పెళ్లి మండపం వద్ద మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మహిళలకు జాకెట్లు , పసుపు, కుంకుమ, గాజులు వితరణగా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మిద్దెల హరి విచ్చేశారు. మహిళా నాయకురాలు మాధవి, ముని లక్ష్మి, విజయమ్మ, కిరణ్మయిచే పాలాభిషేకం చేయించారు. ఈ సందర్భంగా మిద్దెల హరి మాట్లాడుతూ.. అక్కా చెల్లెమ్మలు వడ్డీని చెల్లించే గొప్ప బాధ్యతను అన్నగా తమ్ముడిగా తీసుకున్న దేశంలో ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1300 కోట్లు వడ్డీని చెల్లించి మహిళ అభ్యున్నతే లక్ష్యం గా పని చేస్తున్నారన్నారు.
ఈ పథకం ద్వారా ఎక్కువగా బడుగు, బలహీన, దళిత,మైనార్టీలు లబ్ధి పొందుతున్నారని… అందరూ రాబోవు ఎన్నికల్లో కూడా శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ మాజీ పట్టణ అధ్యక్షుడు కొట్టేడి మధు శేఖర్ మాట్లాడుతూ ఆది నుంచి బీసీ నాయకుడిగా… చేనేత కార్మికులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనార్టీలకు కార్పొరేషన్ సబ్సిడీ రుణాలను వందలాది మందికి ఇప్పించి ఆదుకున్న నాయకుడు మిద్దెల హరి అన్నారు.
ఆయనకు అందరూ అండగా నిలబడాలని కోరారు. మిద్దెల హరికి పార్టీ అధినాయకత్వం న్యాయం చేయాలని డిమాండు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జయదేవన్ గిరి, మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గంగయ్య, యతిరాజులు బండి రమేష్, దావాల గిరి, ఇసుక మట్ల బాలా, గంజి వెంకటేష్, ప్రభాకర్, నున్న సుధా, చల్ల సుధాకర్, మాధవి, ముని లక్ష్మి, కిరణ్మయి, విజయమ్మ, వెంకటేష్, బాబు, సాయి, శివ మిద్దెల హరి యువసేన సభ్యులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
.