కొవిడ్ బారిన పడిన తెలుగుదేశం పార్టీ నేతలు వెంటనే కోలుకోవాలని కోరుతూ ఆపార్టీ శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు మునిరాజా యాదవ్ స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ తోబాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఆయన భార్య బృందమ్మ లు కొవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇలా కొవిడ్ సోకిన తమ నేతలు అందరూ కూడా చక్కగా కోలుకుని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షులు మునిరాజా యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి 101 కొబ్బరి కాయలు కొట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ఆయన సతీమణీ బొజ్జల బృందమ్మ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, నేతలు ప్రసాద్ నాయుడు, ప్రకాష్ నాయుడు కరోనా బారిన పడడం చాలా బాధాకరమన్నారు.
వారు త్వరగా కోలుకోవాలని ఈ పూజలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ గుమ్మడిపూడి దశరథ ఆచారి, రెడ్డివారి గురువారెడ్డి, ఏర్పేడు మండలం అధ్యక్షుడు నైనారు పొన్నారావు, శ్రీకాళహస్తి మండలం అధ్యక్షుడు కామేష్ యాదవ్, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, గోపి, డి వి నారాయణ, కోబాకు లక్ష్మణ్, బాలాజీ, గుర్రప్ప శెట్టి ,సుబ్బయ్య, యాదగిరి, ఆర్ముగం, కృష్ణమనాయుడు, టి. వెంకటేష్, రజినీకాంత్, రామచంద్రయ్య, పసల రామకృష్ణ, వెంకయ్య బాబు, భాస్కర్, రాహుల్ యాదవ్, హేమంత్ యాదవ్, యశ్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post