పోలవరం ప్రాజెక్టు వద్ద వైయస్సార్ గార్డెన్స్ నిర్మాణంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు అధికార్లతో సమీక్షించారు. వైయస్సార్ గార్డెన్స్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. పోలవరం వద్ద జి– హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో వైయస్సార్ విగ్రహం నిర్మించనున్నారు.
కాలం గడుస్తున్నకొద్దీ ఆహ్లాదం, అందం పెరిగేలా వైయస్సార్ గార్డెన్స్ నిర్మించే పద్దతి ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార్లకు సూచించారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్లను రూపొందించాలని ఆదేశించారు. ఈ వైఎస్సార్ గార్డెన్స్ ఏర్పాటు అనేది ప్రకృతి సమతుల్యతను మరింత పెంచే విధంగా నిర్మాణరీతులు ఉండాలని ఆయన మార్గదర్శనం చేశారు. నిర్వహణ వ్యయం కనిష్టంగా ఉండేలా డిజైన్లను రూపొందించాలని సీఎం ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు దిగువన ఒక బ్రిడ్జి నిర్మించేలా అధికారులు ప్రతిపాదించారు. ఈ బ్రిడ్జి నుంచి వైఎస్సార్ విగ్రహం, గార్డెన్స్ ఏర్పాటుకానున్న జి– హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డును వేయడానికి అధికారులు ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తంచేశారు.
.

Discussion about this post