• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 19, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ప్లీజ్ ఒక్కసారి.. వచ్చిపోవా పవన్!

admin by admin
November 1, 2020
0
ప్రజల్లో చైతన్యం చాలంటున్న పవన్!

దయచేసి ఒక్కసారి వచ్చిపోతే చాలని పవన్ కల్యాణ్ ను వేడుకుంటున్నారు. ఎవరా? ఏమిటా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ సంగతేంటో చూడాల్సిందే. 

దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికల ప్రచారానికి దయచేసి ఒక్కసారి రావాల్సిందిగా జనసేన పవన్ కళ్యాణ్ కు మళ్లీ కమలదళం విజ్ఞప్తుల మొదలయ్యాయి. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి రావాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరడం ఆయన తిరస్కరించడం రెండూ జరిగిపోయాయి. వస్తున్నారని రావట్లేదని రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. ఎటూ అక్కడ గెలిచే చాన్సులేదు గనుక.. పవన్ రావడం లేదని కొందరు పేర్కొనగా.. బీజేపీ కూడా అదే ఉద్దేశంతో పెద్దగా ఒత్తిడి చేయలేదు. (ఇదీ చదవండి : బాబును ఫాలో అయితే జగన్‌కు చేటే )

అయితే తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి దుబ్బాకలో కొద్దిగా అడ్వాంటేజ్ ఏర్పడిందని, ఇలాంటి సమయంలో కాస్త గట్టిగా కృషి చేస్తే అవకాశం మెరుగ్గా ఉంటుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తమ పార్టీకి భాగస్వామి పార్టీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రచార బరిలోకి దించడం మంచి వ్యూహం అవుతుందని ఆలోచిస్తున్నారు.

(ఇదీ చదవండి : ఎన్టీఆర్ ముస్లిం టోపీ వివాదం.. రాజమౌళికే ఎడ్వాంటేజీ)

ఇప్పటికే బీజేపీ వర్గాలు ఒకసారి దుబ్బాక ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ ని సంప్రదించాయి. ఆ స్థానంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేదు గనుక ప్రచారానికి వచ్చినా కూడా ఉపయోగం ఉండదని పవన్ కళ్యాణ్ భావించినట్లు సమాచారం. అయితే అంత సూటిగా బిజెపి వారిని నొప్పించే విధంగా కాకుండా అదే సంగతిని తనదైన శైలిలో వారికి చెప్పి ఒప్పించినట్లు వార్తలు వినిపించాయి.

అక్కడితో వ్యవహారం మొత్తం సద్దుమణిగి పోయిందని అనుకోవడానికి వీలులేదు! ఎందుకంటే దుబ్బాక ఉపఎన్నిక వాతావరణంలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రతికూల సంకేతాలు కొంత కనిపిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంబంధీకు ఇళ్లపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి నగదు స్వాధీనం చేసుకోవడం.. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలు తీవ్రమైనవి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను దౌర్జన్యంగా అరెస్టు చేయడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో అడ్వాంటేజ్ ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. 

పైగా తెరాస ప్రభుత్వ హయాంలో స్థానిక అధికారుల మీద అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ బీజేపీ ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేసింది. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం దుబ్బాక వ్యవహారాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా తమిళనాడు కు చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను నియమించింది.

ఇలాంటి నేపథ్యంలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయి అని బిజెపి అనుకోవడంలో తప్పులేదు. గత ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కలేదు- ఈసారి ఎన్నిక మరింత క్లిష్టతరం గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సోలిపేట రామలింగారెడ్డి మరణం అనంతరం ఆయన భార్య పోటీ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఉప ఎన్నికలో అభ్యర్థికి సానుభూతి ఉంటుంది. ఆ సంగతి బీజేపీకి కూడా తెలుసు కానీ.. గత ఎన్నికల కంటె ఏ కొంచెం ఎక్కువ మైలేజీ సాధించినా.. డిపాజిట్ తో పాటు.. తెరాస ఓట్లను ఎంతగా తగ్గించగలిగితే.. తమ ఓటు షేర్ ను ఎంతగా పెంచుకోగలిగితే.. అంత ఘనత అవుతుందని లెక్క వేస్తున్నారు. ఇక్కడ తెరాస మెజారిటీ తగ్గిస్తే గనుక.. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస వ్యతిరేక పవనాలు మొదలయ్యాయని ప్రజలను నమ్మించడం సాధ్యం అవుతుందనే అంచనాతో ఉన్నారు.అందుకే దుబ్బాకపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. దానికి తగ్గట్టుగానే పవన్ కల్యాణ్ ను  కూడా ఎన్నికల బరిలోకి దించాలని తపన పడుతున్నారని తెలుస్తోంది.

Tags: dubbaka bypolldubbaka election campaignjanasenani pawan kalyanజనసేనాని పవన్ కల్యాణ్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply