అల్లు అంటే… వెంటనే మనకు అల్లు రామలింగయ్య నుండి బన్నీ వరకు మూడు తరాల వాళ్లు గుర్తుకొస్తారు. ఇప్పుడు నాలుగో తరం వారు వెండితెరపైకి తెరంగేట్రం చేస్తున్నారు అంటే బన్నీ అభిమానులకు పండగే పండగ… ఎవరంటే ఇంకెవరు బన్నీ గారాల పట్టి అల్లు అర్హ..
శనివారంనాడు అర్హ పుట్టినరోజు ఈ సందర్భంగా అప్పట్లో బేబీ షామిలి నటించిన అంజలి సినిమా గుర్తుందా… తన చక్కటి అభినయంతో అందరినీ అలరించిన అంజలి సినిమాలోని ‘అంజలి అంజలి’ పాటను రీక్రియేట్ చేశారు. అందులో అంజలి బేబీగా అల్లు అర్హ అద్భుతంగా నటించింది. ఇదే విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు తెగ ఆనందంగాచెబుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ కు అయితే పండగే పండగ.
అర్హ నటించిన ఈ సాంగ్ ను ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ తాజా పాటకు గణేశ్ స్వామి కొరియోగ్రఫీ చేయగా, సూర్య సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇందులో అర్హతోబాటు తన సోదరుడు అల్లు అయాన్, తాతయ్యలు అల్లు అరవింద్, కే.సీ.శేఖర్ రెడ్డి, తండ్రి అర్జున్ లు నటించారు. మొత్తానికి ఆనాటి చక్కటి పాటను ఎంచుకుని, ఈ నాటి బుల్లి బేబీ చక్కగానటించి అందరి అభిమానుల అభిమానాన్ని పొందింది. హేపీ బర్త్ డే అర్హా.
అప్పట్లో అంజలి చిత్రంలో అద్భుతమైన పాటను అందించిన ఇళయరాజా, మణిరత్నంకు కూడా వీడియోలో ప్రత్యేకంగా థఆంక్స్ చెప్పారు. రీక్రియేషన్.. అచ్చం ఒరిజినల్ పాట లాగే అనిపించేలా చక్కగా చేశారు.
.

Discussion about this post