యూత్ మ్యూజిక్ వినాలంటే ఎవ్వరూ అభ్యంతరం చెప్పారు. కానీ.. దానికి కూడా ఒక హద్దు, ఒక పద్ధతి ఉండాలి. రోడ్ల మీద నడుస్తూ, టూవీలర్ డ్రైవ్ చేస్తూ.. రోడ్డు దాటుతూ.. పరిసరాలు పట్టించుకోకుండా.. తిరుగుతోంటే.. ప్రమాదం జరగక ఏమౌతుంది..
నేటి యువత వినికిడి విషయంలో కొన్నింటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మరి కొన్నింటిని అసలు పట్టించుకోవడం లేదు. దీంతో అప్పుడప్పుడు ప్రమాదాల బారిన పడుతూ, కొండొకచో ప్రాణాలు కోల్పోతూ… తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఎలాంటివి వింటున్నారు అంటే మ్యూజిక్… గేమ్స్..
మొన్నటి వరకూ పబ్జీ గేమ్ఎందరో చిన్నారులను బలిగొంది. దీంతో మన దేశంలో దాన్ని బ్యాన్ చేసేశారు. ఈ నిర్ణయం చాలామంది తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించింది. అయితే మ్యూజిక్ కు బానిసలైన పిల్లలు చెవులలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఇక బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నట్టు తమలోకంలో తాముంటున్నారు. అయితే ఇంట్లో ఉంటే… దానివల్ల ఎవరికీ ఎలాంటి బాధా, నష్టం ఉండదు. అదే రోడ్డుపై నడుస్తూ చెవులను మూసుకునే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే వారి ప్రాణాలకే ప్రమాదం అనే విషయం అందరికీ తెలిసినా… యువత అదే దారిలో వెళుతోంది. తాజాగా ఇద్దరు యువకులు తమ చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ పై నడుస్తుండగా రైలు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు.
నేటి యువత చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని రోడ్డుపై వెళుతుండగా పలుమార్లు రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలు మనం ప్రతిరోజూ వింటూనే ఉన్నాం. అలాగే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫోను మాట్లాడుతూ వాహనాలునడుపుతూ ప్రమాదాలకు గురైన వారి గురించి కూడా మనం వార్తలో చూస్తున్నాం… వింటున్నాం… అలాగే మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ జిల్లాలోని బిరోదాకు చెందిన ఇర్షాన్, కలీమ్ అనే స్నేహితులు ఇద్దరూ సాయంత్రం ఆరుగంటల సమయంలో రైల్వే ట్రాక్ పై నడుస్తూ హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏదో వింటున్నారు.
అదేసమయంలో ఆట్రాక్ పై వచ్చిన కర్ణాటకఎక్స్ ప్రెస్ వారిని ఢీకొంది. దీంతో క్షణాల్లో ఆ ఇద్దరి శరీరాలు ముక్కలుగా అయి ట్రాక్ పై దూరంగా పడ్డాయి. రైలు డ్రైవర్ అదుపులోకి తీసుకుని విచారించగా, తాను హారన్ మోగించానని, అయినా వారు వినలేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నాడు.
అయినా నేటి యువత ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీకు ఏదైనా ఆపద కలిగితే ముందుగా తల్లడిల్లేది తల్లిదండ్రులే… ఈ విషయాన్ని గుర్తుంచుకుని, జాగ్రత్తగా నడుచుకుంటే… అందరికీ మంచిది.
తుంగభద్ర పుష్కరాల సందర్భంగా ప్రత్యేక కథనాలు.. ఇవీ చదవండి : తుంగభద్ర అంటే.. ఆదివరాహస్వామి స్వేదం.. ఆ విశేషం మీకు తెలుసా? పుష్కరం అంటే పన్నెండేళ్లకు ఓసారి వచ్చే పండుగ పుష్కరాల్లో ఎలాంటి పనులు చేయాలో తెలుసా? ఏయే నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసా?
.

Discussion about this post