ముఖ్యమంత్రిగారూ… ఏంటి సార్…! మళ్లీ ఏదో వరాల మూట భుజాన వేసుకుని తయారయ్యారు… గ్రేటర్ ఎన్నికల కోసమా…! అలాగే వుంది… మూటనుండి నీళ్లు కారుతున్నాయే….? ఓ… గ్రేటర్ జనాలకు నీళ్లు ఇస్తామని హామీ ఇస్తున్నారా…! అయినా నీళ్లకు జనాలు పడిపోతారా…? ఏంటి సార్ మీరు? మొన్నటికి మొన్న ఎన్ని నీళ్లు…! మహానగరంలో ఎక్కడ చూసినా నీళ్లే…! గత వందేళ్ల చరిత్రలో ఇంత పెద్ద వర్షం మహానగరం ఎరగలేదని అందరూ చెప్పుకున్నారు సార్…! అన్ని నీళ్లు వాళ్లకు వచ్చేశాయి…! అన్ని నీళ్లను చూసిన జనాలు ఇంక నీళ్లకు అంత విలువ ఇస్తారంటారా…? ఏమో … అయినా ఇంకా నీళ్లిస్తాం… గొర్రెలిస్తా… బర్రెలిస్తా… ఉద్యోగాలిస్తాం… అందులోకూడా ఇంటికో ఉద్యోగం… ఇలాంటి హామీలను నమ్మే స్థితిలో జనాలు లేరుసార్… అందునా అంతో ఇంతో చదువుకుని, ఓటు వేయడానికి కూడా చాలా బద్దకించే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉండే గ్రేటర్ హైదరాబాద్ ఇది. ఇక్కడ ఇలాంటి చమక్కులు, గిమ్మిక్కులు, ట్రిక్కులు పనిచేయవు. కాస్త ఆలోచించండి… మరేదైనా కొత్త వల వెతకండి… ఎంఐఎంకు అసలు తిరుగు ఉండదు అని అందరూ అనుకునే పాతబస్తీలోనే పాపం అసదుద్దీనుకు చేదు అనుభవం ఎదురైంది. చేసేది లేక చెవులు జాడించుకుంటూ వెనుక్కు తిరిగారు.
జాంబాగ్ డివిజన్ లో ఎంఐఎం అభ్యర్ధికి మద్దతుగా ప్రచారానికి వెళ్లిన అసదుద్దీన్ ఒవైసీని అక్కడి ప్రజలు నిలదీశారు. తమకు వరద బాధితులకు అందజేసిన నష్టపరిహారం అందలేదని వారు అడిగారు. అంతేకాదు… తాము కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరూ వచ్చి పరామర్శించలేదని, మరిప్పుడు ఓట్లు ఎట్లా అడుగుతారంటూ వారంతా ఆయన్ని నిలదీశారట. చేసేది లేక పాపం ఆయన వెనుదిరిగారు.
అయినా… ఇంకా పాతకాలం నాటి హామీలను పట్టుకుని వేళ్లాడకండి సార్… ఏదైనా కొత్తగా ఆలోచించి, ఎలా గ్రేటర్ జనాలను బుట్టలో వేయాలో ఆలోచించి, దానికి అనుగుణంగా హామీలను తయారు చేసుకుని జనాల్లోకి రండి సార.. ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో…!
.
Discussion about this post