కళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్టర్ రమణ తేజ కాంబినేషన్ లో రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో SRT ఎంటర్ టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కిన్నెరసాని.
కిన్నెరసాని టైటిల్ పోస్టర్‌లో సైతం సినిమా కథాంశం ప్రతిబింబిచేలా ప్రశాంతమైన సముద్రపు ఒడ్డు, యాట్, గొలుసులు, తాళం వంటి ఎలిమెంట్స్ జోడించి డిజైన్ చేయడం జరిగింది. అలానే కిన్నెరసాని టైటిల్‌కి క్యాప్షన్‌గా అతి సర్వత్ర వర్జయత్ (హద్దు లేకపోవడం ప్రమాదకరం) అనే సంస్కృత పదాన్ని కూడా జోడించారు.
తాజాగా ఈ సినిమా నుంచి పార్వతి పురం అనే పాట విడుదలైంది. కిట్టు విస్సాప్రగడ ఈ పాటకు సాహిత్యం అందించగా.. ఉమా నేహా, రేవంత్, ధనుంజయ్ సీపాన పాడారు. పాట చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇంటెన్స్ డ్రామాగా ఈ టీజర్ కనిపిస్తుంది. కిన్నెరసాని చిత్రానికి దేశరాజ్ సాయితేజ కథ, కథనం అందిస్తున్నారు. గతంలో సాయి తేజ్ కల్కి వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించడం విశేషం. అలానే ఛలో, భిష్మ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్ర పాటలు లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్‌లోకి విడుదల అవుతున్నాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
.