వరదలతో ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలని, ఎవ్వరికీ పరిహారం అందలేదన్న మాట సత్యవేడు నియోజకవర్గంలో ఎక్కడ రాకూడదని స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
వరద బాధితులపట్ల ఉదారంగా ఉండటంతోపాటు మానవతా దృక్పథాన్ని చూపించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం నియోజకవర్గ పరిధిలోని కె.వి.బి పురం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ.. కెవిబిపురం మండల పరిధిలో 502 మంది వరద బాధితుల ఒక్కో కుటుంబానికి రూ. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో ఉల్లిగడ్డలు, కిలో ఆలుగడ్డలును పంపిణీ చేశామన్నారు.
మూడు రాజధానులు విషయం పై స్పందించిన ఎమ్మెల్యే తాము వికేంద్రీకరణపై వెనుకడుగు వేయలేదని అన్నారు. చంద్రబాబు పగటి కలలు కంటే ఆయన ఖర్మని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పారని, సాంకేతిక సమస్యలను తొలగించి మళ్లీ వస్తామని అన్నారు. అమిత్ షా ఫోన్ చేస్తే బిల్లు రద్దు చేశామనడం అవివేకమని మండిపడ్డారు. ఫోన్ చేసినట్లు అమిత్ షా వీళ్లకు చెప్పాడా? అని సూటిగా ప్రశ్నించారు.
ఇలాంటివి ప్రచారం చేయడంలో టీడీపీ నాయకులు ముందుంటారని ఎద్దేవా చేశారు. మండలి విషయంలోనూ తాము వేసింది వెనుకడుగు కాదని ఆది స్పష్టం చేశారు. ఆ రోజు మండలిలో తమ బలాన్ని ఉపయోగించి ప్రతీ దాన్ని టీడీపీ నాయకులు రాజకీయం చేశారని మండిపడ్డారు.
అనేక బిల్లులు ఆపింది నిజం కాదా? అని నిలదీశారు. అలా ఒక సభను దుర్వినియోగం చేయొచ్చా? అని ప్రశ్నించారు. అందుకే అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం నుంచి స్పందన రాలేదని అన్నారు. మరో వైపు ఇప్పుడు ఆ శక్తుల బలం తగ్గిందని అందుకే మండలి కొనసాగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
రాజధానిపై రకరకాల ప్రచారం చేస్తున్నారని, కానీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గ్రామ స్వరాజ్యం.. గాంధీజీ కల… అనే మాటలు 70 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం.ఆ మాటలను నిజం చేస్తూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిందదని గతంలో అయితే పింఛను, రేషన్ కార్డ్ కావాలంటే ఎంపిడిఓ ఆఫీస్ వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది.
కానీ ఇప్పుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కారం అవుతున్నాయి. పింఛన్, రేషన్ కార్డులు కూడా వెంటనే మంజూరు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు, పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలు నిర్ణయించాలి. కానీ ఇప్పుడు ఎవరి సిఫార్సులు అక్కర్లేదు. ఇంత మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కి యావత్ ప్రజానీకం బ్రహ్మానందం పడుతుందన్నారు.
‘వాలంటీర్ల వ్యవస్థ సేవలు అజరమరమని ఎమ్మెల్యే కొనియాడారు… ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు గవర్ల కృష్ణ తో పాటు మండలానికి చెందిన వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు ఉన్నారు.
.