చిత్తూరు జిల్లా సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను ఆదివారం నిర్వహించారు.
1990-1997 విద్యా సంవత్సరంలలో పాఠశాల విద్య నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు
ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలిశారు.
అనాటి మధుర స్మృతులతో కలగలసిన ఆనందాన్ని పంచుకున్నారు. తోటి స్నేహితులు, అధ్యాపకులతో ఉన్న అనుబంధపు ఙ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ,కళాశాల అభివృద్ధిలో తమవంతు పాత్ర పోషిస్తామన్నారు.
విడతల వారిగా విద్యార్థులకు చేయూతను అందిస్తూ, చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలపై ప్రణాళికను రూపొందించుకున్నామని తెలిపారు.
ఈకార్యక్రమంలో వి.కె. ఎన్ తిరునీలకంఠం, సత్యవేడు మునిక్రిష్ణయ్య, వెంకట్, మురళి, మురుగయ్య, సురేంద్ర, శివరామక్రిష్ణ, పురుషోత్తం, పూర్వ విద్యార్థినీ విద్యార్థులు పాల్గోన్నారు.
.