తిరుపతిలో వరదల వల్ల నష్టపోయిన బాధితులకు నెస్తే, జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా (జెసిఐ) అధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు.
వస్తువులను 1000 కిట్లలో నింపి తిరుపతి అర్సన్ తహశీల్దారు వెంకట్రమణకు ఆయన కార్యాలయంలో అందజేశారు.
నెస్లే జెసీఐ ఇండియా సిఎస్ఆర్ కనెక్ట్ సేవా కార్యక్రమం కింద దీనిని చేపట్టారు. తరువాత అర్ డిఒ కార్యాలయంలో కలసిన దాతలను జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అభినందించారు.
సామాజిక బాధ్యతగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నెస్లే కార్పొరేట్ వ్యవహారాల మేనేజర్ ఎసీమ్ అహ్మద్, జెసిఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ హర్షవర్ధన్ రెడ్డి, తిరుపతి శాఖ అధ్యక్షుడు హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు పి. రాజు రెడ్డి, చరణ్, పావని, డిప్యూటీ తహసిల్దార్ ఎం అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post