మయూర షుగర్స్ అధినేత జయరాం చౌదరిని వెంటనే అరెస్టు చేయాలని రైతు సంఘం రాష్ట్ర పాధ్యక్షురాలు హేమలత డిమాండు చేశారు. తిరుపతిలోని జయరాం చౌదరి ఇంటి ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో పది రోజలుగా నిరసన కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో గురువారం రైతు సంఘం నేతలు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా హేమలత మాట్లడుతూ.. 10రోజుల నుంచి మయూర యాజమాన్యం ఇంటిముందు రైతులు పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు.
ఆర్ ఆర్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములు వేలం వేసి తక్షణమే రైతులకు ఇవ్వాలని డిమాండు చేశారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. బకాయిలు చెల్లిస్తారని రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు.
రైతులను మోసం చేసిన జయరాం చౌదరిని ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను వారు నిలదీశారు. రైతులు 10రోజులు గా పోరాటం చేస్తుంటే ఎవరికీ పట్టకపో వడం అన్యాయం అన్నారు. కనీసం అధికారులు ఎటువైపు చూడక పోవడం దారుణమన్నారు.
వెంటనే రైతుల సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని… ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, ఐద్వా జిల్లా కార్యదర్శి పి సాయి లక్ష్మి, రైతు సంఘం నాయకులు పద్మనాభ రాజు, చంద్రశేఖర్ రాజు, జానకి రామ రాజు, రోసి రాజు, విజయపురం మండలం రైతులు కృష్ణమూర్తి, బాబు నాయుడు, శ్రీధర్ ,షణ్ముఖ రాజు, మణి, రేణుకమ్మ, జయమ్మ,, మునిశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post