తిరుపతి అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు చదువు భారంగా మారడం తో చదువుల కు దూరం అవుతున్న వారందరికీ చదువు చెప్పించడం కోసం
గంధమనేని శివయ్య , కృష్ణారెడ్డి మెమోరియల్ సొసైటి ఆధ్వర్యంలో ఉచితం గా ఏర్పాటు చేస్తున్న టూషన్ సెంటర్ ను సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు 8 .30 గంటల కు ఓటేరు గంగిరెద్దుల కాలనీ లో ప్రారంభిస్తున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ నేడొక ప్రకటన లో తెలిపారు.
భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ) 97 వ వ్యవస్థాపక దినోత్సవం ను పురష్కరించుకుని ఓటేరు సమతా నగర్ , గంగిరెద్దుల కాలని , నక్కల కాలనీ , మార్క్స్ నగర్ , ఎ బి బర్థన్ కాలని , దేముడు కాలనీ , లింగేశ్వర్ నగర్ , ఎం ఆర్ పల్లి సీతమ్మ నగర్ , కృష్ణారెడ్డి కాలనీ , ఇంద్రా నగర్ , తదితర ప్రాంతాల్లో ఉన్న పేద విద్యార్థులకు మొదటి తరగతి నుండీ 10 వ తరగతి వరకు ఉచితం గా టూషన్ చెప్పిస్తున్నట్టు తెలిపారు .
ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు .ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పి హరినాథ రెడ్డి , జి . ఓబులేషు , జిల్లా కార్యదర్శి రామానాయుడు తదితరులు పాల్గొనేదరు . కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
.

Discussion about this post