మంచి పుస్తకం మంచి స్నేహితుడులాంటిదని పుస్తకాలు కాలక్షేపాలు కాదని జ్ఞాన నిక్షేపాలని శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి ,శాసన మండలి సభ్యులు కత్తి నరసింహా రెడ్డి అన్నారు.
శనివారం చిత్తూరు జిల్లా రచయితల సమాఖ్య సమన్వయ కర్త సాకం నాగరాజ ఆధ్వర్యంలో తిరుపతి పట్టణంలోని బాలాజీ కాలనీలో స్వర్ణ జిరాక్స్ ముందర సగం ధరలకే సరికొత్త పుస్తకాలను సందర్శించి రెక్కలు చాచిన పంజరం,తరిమెల నాగిరెడ్డి పుస్తకాలను పాఠకులకు ఎమ్మెల్యే భూమన పరిచయం చేశారు.
మూడుగంటల సమయంలో 20వేల రూపాయలకు పుస్తకాలు అమ్ముడైనాయి.
పాఠకుల నుండి విశేష స్పందన రావడం విశషమన్నారు.
ఈ కార్యక్రమంలో శైలకుమార్, నామిని సుబ్రమణ్యం నాయుడు,రాసాని, తమటం రామచంద్రారెడ్డి, పేరూరు బాలసుబ్రమణ్యం,యువశ్రీ మురళి,గంటా మోహన్,గాజుల నాగేశ్వర రావు,సురేంద్ర రొడ్డ,దయాకర్,నూకా రాంప్రసాద్ రెడ్డి,సాకం ప్రభాకర్, గాలి ధనంజయ నాయుడు పలువురు రచయితలు పాల్గొన్నారు
.

Discussion about this post