తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్ లో ఉన్న ఐదు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని సీపీఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ డిమాండ్ చేశారు.
జీతాల కోసం నిరసన దీక్షలు చేస్తున్న కార్మికులకు మద్దతుగా రెండవ రోజైన గురువారం జల్లా విశ్వనాథ్ దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వనాత్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఎప్పటికప్పుడు కార్మికుల సమస్యలు పరిష్కరించేలా అధికార యంత్రాంగం ఉండాలని అనేక దఫాలు తెలియపరచినప్పటికీ … ఎక్కడ న్యాయం జరిగిన దాఖలాలు లేవన్నారు.
పేరు కేమో ప్రభుత్వం 549 జీవోను విడుదల చేసినప్పటికీ రెండున్నర ఏళ్లుగా ఏ ఒక్కరికి ఈ జీవో ప్రకారం జీతాలు చెల్లించలేదన్నారు.
కాంట్రాక్టర్లేమో కార్మికుల దగ్గర శ్రమదోపిడి చేయించుకుంటున్నారని విశ్వనాథ్ వాపోయారు. కార్మికుల శ్రమకు తగిన జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు మోసం చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడం బాధాకరమన్నారు.
ఇకనైనా ఈఎస్ ఐ ఆస్పత్రి సూపరింటెండెంట్ రు బాధ్యత తీసుకొని కాంట్రాక్టర్ తో మాట్లాడి కార్మికుల జీతభత్యాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇది శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది 2 వ రోజు నిరసన కార్యక్రమని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఈఎస్ఐ ఆస్పత్రి కమిటీ కార్యదర్శి నరసింహులు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి కె. రాధాకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ శివ కుమార్, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎండి రవి, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర, ఈఎస్ఐ కార్మికులు పాల్గొన్నారు.
.

Discussion about this post