తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన రవి నాయుడును నియమిస్తూ నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పార్టీ అద్యక్షుడు అచ్చం నాయుడు ప్రకటించారు.
రవి నాయుడు గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక నాయకుడిగా పనిచేస్తూ కళాశాల టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నుంచి యూనివర్సిటీ అధ్యక్షుడిగా ,చిత్తూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రెండు పర్యాయాలు ఉన్నారు.
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, టిఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయకర్తగా, తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అదే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం తోపాటు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా నియామకం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రాష్ట్రస్థాయిలో తెలుగు యువత బలోపేతానికి కృషి చేస్తానని తన మీద నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.
.

Discussion about this post