తిరుపతిలో ఏపీ టూరిజం, ట్రాన్ఫోర్ట్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. అతికిరాతకంగా హత్య చేసిన దుండగులు శవాన్ని మూటగట్టి భాకరాపేట ఘాట్ రోడ్డు పక్కన పడేశారు. పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని నాలుగు రోజుల్లో ఛేదించారు
తిరుపతి ఎల్.బి.నగర్ కు చెందిన చంద్రశేఖర్ ఏపీ టూరిజం, ట్రాన్ఫోర్ట్ లో సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. చంద్రశేఖర్ ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే తిరుపతికి చెందిన మధు, రాజు, పురుషోత్తంలకు వడ్డీలకు అప్పులు ఇచ్చాడు.
అప్పు తీసుకున్న ముగ్గురు చంద్రశేఖర్ ను చంపేందుకు పక్కా స్కెచ్ వేశారు. గతంలో కూడా మద్యంలో నిద్రమాత్రలు కలిపి చంపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.
ఈ క్రమంలోనే డిసెంబర్ 31వ తేదీ రాత్రి మద్యం సేవించేందుకు పెద్దకాపు వీధిలో ఉన్న ఓ షెడ్డుకు మధు, రాజు, పురుషోత్తంలు చేరుకున్నారు. చంద్రశేఖర్ కు ఫోన్ చేసి డబ్బులు ఇచ్చేస్తాం అక్కడకు రావాలని పిలిపించుకున్నారు.
అక్కడికి చేరుకున్న చంద్రశేఖర్ ను రాడ్డుతో తలపై కొట్టి, ముఖాన్ని చేతులను టేపుతో చుట్టేశారు. తర్వాత ఓ గోనె సంచెలో కుక్కి అట్టెపెట్టెలో పెట్టి ఫ్యాక్ చేశారు. బాడీని కారులో తరలించి భాకరపేట ఘాట్ లో పడేసి పరారయ్యారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మొదట మిస్సింగ్ కేసు నమోదుచేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మర్డర్ మిస్టరీని చేధించారు.
ముగ్గురు నిందితులలో రాజును అరెస్ట్ చేసి వివరాలు సేకరించారు. పరారైన మధు,పురుషోత్తంల కోసం గాలిస్తున్నట్లు డిఎస్పీ నరసప్ప తెలిపారు.
.

Discussion about this post