దళిత హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి డి.రామానాయుడు పిలుపు నిచ్చారు . తిరుపతిలోని బైరాగ పట్టెడలో గల సీపీఐ కార్యాలయం లో గురువారం డీ హెచ్ పీఎస్ డైరీ ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ… రాష్ట్రంలో దళితుల ఎదుర్కొంటున్న సమస్యల పైన.. దాడులు పైన… వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న సంఘం దళిత హక్కుల పోరాట సమితి అన్నారు.
దళితుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడంలో దళిత హక్కుల పోరాట సమితి అగ్రభాగాన ఉంటోందని తెలిపారు . దళిత హక్కుల పోరాట సమితి నూతన డైరీ ప్రతి వారి చేతిలో ఒక కరదీపిక లాంటిది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు జోరేపల్లి రామచంద్రయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కాళయ్య , జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. నాగరాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంకా, జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీనివాసులు , డీహెచ్ పీ ఎస్ నగర అధ్యక్షులు బి . నాగభూషణం, మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు మంజుల, నదియా రత్నమ్మ , డీ హెచ్ పీ ఎస్ జిల్లా నాయకులు దాసరి చంద్ర , పెనుమూరు బాబు , రఘు , రాజశేఖర్, డి .రామచంద్రయ్య డాక్టర్ బలరాం , మారకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post