చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో మూడేళ్ల బాలుని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఈ ఘటన సంచనలం రేకిస్తోంది.
బాలుని రక్షించాలని అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏర్పేడు మండలం ఇసుకతాగేలి చెరువు కట్ట వద్ద కాపలాగా ఉన్న పొగటి పెంచులయ్య రెండవ కుమారుడు చెంచురామ్ (3) అనే బాలుని ఓ వ్యక్తి అపహరించాడు.
బాలుని అపహరించిన వ్యక్తి పొడవాటి గడ్డం కలిగి ఉన్నాడు. ఇతను యానాది కులానికి చెందిన వెంకటేష్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. చెంచురామ్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తి పొడవాటి గడ్డం కలిగి… బక్కగా, నలుపు రంగులో ఉంటాడని పోలీసులు చెప్పారు.
తెల్ల చారలు కలిగిన చొక్కా ధరించారని వారు తెలిపారు. బాలుని ఎందుకోసం కిడ్నాప్ చేశారో తెలియడం లేదు.
కిడ్నాపర్ ఆచూకీ తెలిసిన వారు ఏర్పేడు సీఐ 9440900729 లేదా రేణిగుంట డీఎస్పీ 9491086025 ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.
.