• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, August 18, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

చా.ప్ర రాతలు: నీ జ్ఞాపకాలు వదలవు రవణ!

(ముళ్ళపూడి వెంకట రమణ జయంతి సందర్భంగా)

admin by admin
June 29, 2026
0
చా.ప్ర రాతలు: నీ జ్ఞాపకాలు వదలవు రవణ!

“బుడుగు” సీగానపెసూనాంబల” ని చూసిన మా కళ్ళు మసకేసినా, మనసు మాత్రం `కోతికొమ్మచ్చులాడుతోంది`. చేతికి అంటుకున్న నెయ్యికలిపిన కొత్తావకాయ సువాసనలా నీ జ్ఞాపకాలు వదిలిపెట్టడంలేదు. భలోవోడివి రవణ! బాపు కన్న ముందు “సొడ్డేసేసి” మమ్మల్ని ఒగ్గేసి మా ముత్యాలముగ్గేసినోడిని కూడా జతేసేసుకున్నావు.

..చాగంటి ప్రసాద్
90002 06163

తెలుగు అక్షరాల్లో “అలో వలో” లు, మధ్యలో దర్జాగా తిరిగే అప్పారావులు, పిల్లలవాళ్ళు, తీతాగాళ్ళు కనబడుతున్నారు. నువ్వు జీవితాన్ని నూరుపాళ్ళు చూసేసి వ్రాసిన రాత రమణీయంగా కలలో ఇప్పటికీ కనబడతాంది. ` ఎండా వాన కలిస్తే రంగుల హరివిల్లు లాగ, నవ్వు ఏడుపు కలిపి కథ రాస్తే రంగుల విల్లు` కదా అనే ఊహాతో , డొక్క మాడుతున్న `ఆకలి భలే జోకలి` అని గొప్ప చమత్కారంగా “ఆకలికి జోకులద్ది” కథలు రాసావు,, మేము నవ్వుకున్నాం గానీ కళ్ళమ్మట నీళ్ళు మాకు తెలియకుండా నీకిష్టమైన గోదారిలా ఉప్పొంగాయి. ఆకలిఆనందరావులు , ఇప్పుడూ ఉండే ఉంటారు గానీ , వలువల క్రింద ఆకలిని దాచేసుకున్నారనుకుంటా సిగ్గుతో.

`నవ్వితే నవ్వండి` లేదా ఫోoడి అని ఎన్నో కధలు రాసి పడేశావు . దాంతో `ఓలు మొత్తం` తెలుగు పాఠకులకు `సేరిబ్రల్ సినేమియా` లా `రవణ వ్యంగ్యో మేనియా` అంటుకుని వదలడం లేదు.. నువ్వు రాసినవి చదవక పోతే జ్వరం వస్తే చప్పిడి తిన్న చంటాళ్ళా అయ్యిపోతామని భయపడి బుద్ధిమంతులై పోయి,, జనతా ఎక్స్ ప్రెస్, రాజకీయ భేతాళo,, లాంటి ఇత్యాది హాస్యఔషధాలు మ్రింగి బ్రతికేసాం ఇన్నాళ్ళు!, ఈ మధ్య నీలాంటి డాక్టరు కనపడ్డం లేదు నేస్తం.

..ఆ రోజుల్లో నీ నుంచి మేం నేర్చుకున్న చమత్కారపు మమకారపు తెలుగు, రాధ కురుల్లో చిక్కుకున్న బొండుమల్లెలా! మా గుండెల్లో చిక్కుకుపోయింది!

‘ఇచ్చుటలో ఉన్న హాయి మరెచ్చటనో లేదుటా` అని బుద్దిమంతులకి `అప్పోపదేశం` చేసే అప్పుని జన్మ హక్కు చేసే `అప్పార్ధ సారధుల`ని తెలుగునేల మీదికి వదిలేవు. ఇప్పుడు అది పెద్ద ఫ్యాషన్, పేసన్ అయ్యి కూర్చుంది . ప్రతివాడికి `ఋణానందం` ఎక్కువయ్యి ఫారిన్ లో సెటిలైపోతున్నారు.

వ్యంగ్యo , కామెడీ తప్ప వేరేది రాయలేడు రవణ అన్న పాఠకులని సమ్మోహన పరుస్తూ, . తెలుగు పాఠకుడు తాద్యాత్మo చెందేలా , కానుక కథ వ్రాసి , నల్లనయ్య వేణుగానం వినిపించావు, దాంతో అబ్బో ఏమో అనుకున్నవే…….. అనే లోపులోనే నీ చెలికాడు మాకు “గీతల్లో రామదర్శనం “ చేయిస్తే ఆ రాములోర్ని సీతమ్మని సులువుగా ఎలా కొలవాలో చెప్పేసావు. దాంతో మేం మాములుగానే రోజూ నీభాషలోనే సంతోషంగా అన్నీ అడిగేస్తున్నాము, కష్టాలు కన్నీళ్ళొస్తే ఆయన కరగకపోతే కడిగేస్తున్నాం. ఎలా కట్టేసేవయ్య ! రాముణ్ణి తెనుగువాడి లోగిళ్ళో. మాకు అంతవరకూ తెలియదు దేవుణ్ణి ఇలాక్కూడా కొలవొచ్చని. పోన్లే రాముడొక్కడే అలా పలుకుతాడేమో ననుకుంటే, కన్నప్పతో కోయభాషలో శివుణ్ణి పిలిపించి ఏ భాషలో పిలిచినా దేవుడు పలుకుతాడని మాకు `కనువిప్పు కలిగించావు సామి!

సినేమా కతలు నువ్వు చాలా అలవోకగా చెప్పేసావు.` సరస్పత్తోడు`!. నీ కథల్ని నీ జతగాడు బొమ్మల్లోకి తర్జుమా చేసి సినీ గీతాసారం గొప్పగా చూపించేస్తాడు. నువ్వు రాసిన డవిలాగులు మాత్రం తెలుగువాడి ఇంట్లో తరగని ఆవకాయ జాడిలే. కాదన్న వాళ్ళని `డిక్కీలో తొంగో` పెట్టెయ్యాలి ఆళ్ళ `సిగదరగా`. అత్తారింటికి అమ్మాయిని అప్పిగించేటప్పుడు “కాల్లో ముల్లు గుచ్చుకుంటే, కంటిలో గుచ్చుకోలేదని “ ధైర్యం చెప్తే, ఆ గోరంత దీపం ఆడపిల్లల గుండెల్లో జ్యోతి లా ప్రజ్వలించింది.

మా ఇళ్ళల్లో నేనేక్కువంటే , నేనేక్కువ అని మొగుడు , పెళ్ళాలు వాదించుకుంటే, నువ్విచ్చిన `పెళ్లి పుస్తకాన్ని` చదువుకుని, అంతా `ముళ్ళపూడి వారు చెప్పిన `విష్ణుమాయ` అని `తుత్తి` పడిపోయారు.మిష్టర్ పెళ్ళాలు ,మగాళ్ళేమో విష్ణు మాయని చూపిస్తున్నారు ఇప్పటికీ.

ఒక విచారంగా ఉంది రవణ! ఈ మధ్య కాలవలో వెళ్ళే గూటి పడవలు కనుమరుగైనా “తేగలోచందమామ” మాత్రం నిన్ను గుర్తు చేయడానికా అన్నట్టు గోదారొడ్డున అప్పుడప్పుడు కనబడతాంది. కానీ ఆ రుచి లేదు ఇప్పుడు.. మీరిద్దరు రావడం లేదని, గోదారి కూడా మన భాష లాగే చిక్కి శల్యమైంది.

మా మనసుల్లో చెదరని బుడుగు, సీగానా పెసూనాంబలు, రాధ గోపాలాలు మాతో ఇంకా కబుర్లు చెప్తున్నారు. మీరొస్తారాని భరోసా తో నిద్రోతే నువ్వు నడిపిన “జనతాఎక్సు ప్రెస్ “మా గుండె వాకిట ఆపినట్టు, మీరు దిగినట్టు కలలు వస్తున్నాయి తప్ప మీరు దిగడం లేదు. మా బతిక్కి అర్థం, పరమార్థం మళ్ళీ చెప్పి మా తెలుగు వాకిళ్ళ ముందు “ముత్యాల ముగ్గేద్దురు”

మేము ఎంత వేడుకున్నా,మీపాటికి మీరేమో రాములోరి సేవలో సేదతీరుతూ ఆయనకి, అమ్మకి కొత్త కొత్త కథలు చెప్పుతూ “నవ్వుల నవ్య రామాయణం” ఇనిపిస్తూ నువ్వూ, కుంచెతో గీస్తూ నీ జతగాడు బిజీ గా ఉండి ఉంటారు మరి! మేం ఓ పాలి సీతమ్మతో రాములోరికి సిఫార్సు చేయించి, మిమ్మల్నిద్దర్ని రప్పిద్దామంటే , `సిఫార్సులు`తో ఏం లాభం లేదంటావు.

మీ ఇద్దర్ని ఆరణాల తెలుగువారిగా మళ్ళీ మా కోసం పుట్టించమని , ఆ సీతారావుణ్ణి ప్రార్ధిస్తూ, మీ జ్ఞాపకాల వ్రాతల్ని నుదుటమీద ఇగిరిపోని విభూతిగా రాసుకుని కాలం గడుపుతున్నాము.

Tags: chaganti prasadmullapudi venkata ramanaచాగంటి ప్రసాద్బాపు రమణముళ్లపూడి వెంకట రమణ జయంతి
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply