• About Us
  • Contact Us
  • Our Team
Thursday, November 12, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

సినిమా రివ్యూ: ‘రామాయణం’ భారతీయుల జీవనాడి

admin by admin
November 12, 2026
0
సినిమా రివ్యూ: ‘రామాయణం’ భారతీయుల జీవనాడి

రాముడు మానవుడుగా పుట్టి మహానీయుడిగా పరిణామం చెందాడు.. రాముడు భారతీయులకు స్ఫూర్తి ప్రదాత. ధర్మ రక్షణ ఆయన పూనిక. ఆయన బాల్యం, యవ్వనం, సంసార జీవితం, త్యాగాలు, పోరాటాలు, పాలన అన్నీ మన మనస్సుల్లో ఇంకిపోయాయి. రాముడంటే ఇలాగే ఉంటాడు అనే ఆయన వ్యక్తిత్వం మన ఊహల్లో బలంగా రూపు దిద్దుకుంది.


మనల్ని ధర్మం వైపు నడిపించడానికి,
ధర్మాన్ని పరిరక్షించడానికి భూమి మీద మనిషిగా పుట్టాడు. అందువలనే యుగాలు మారినా, కాలాలు మారినా రామకథ ఇప్ప్పటికి కడు రమణీయం, స్మరణీయం. ఎన్ని కష్టాలు వచ్చినా చలించని సుగుణాభిరాముడు రాశీభూతమైన ధర్మానికి ప్రతీక. శ్రీరాముడి ధర్మగుణం, సీతామాత పవిత్రత, లక్ష్మణుడి సేవాతత్పరత, హనుమంతుడి నిరంతర రామభక్తి, భరతుడి నిస్వార్థం, సుగ్రీవుడి మైత్రి కలిసిన మహా గొప్ప కావ్యం రామాయణం. ఎన్నియుగాలైనా రామ కథ, రాముడి దివ్యత్వం మానవాళిని జాగృతం చేస్తూనే ఉంటుంది.

మంచి బాలుడు, మంచి కొడుకు, మంచి భర్త, మంచి అన్న, మహమంచి మిత్రుడు, మహా యోధుడు, గొప్ప పాలన అనే ఆయన సుగుణాలను ప్రోది చేసి రూపం ఇస్తే ఆయన రాముడు. అలాంటి రాముడిని, ఆయన కథను నేటి రామాయణం సినిమా లో ఎలా చూపించారు? అసలు రామాయణ కథనం ఎంతవరకూ బావుంది? చూద్దాం..

దర్శకుడు నితీష్ తివారి, శ్రీరామ్ రాఘవన్ కలిసి రామాయణంలో రావణుడి వైపు నుండి కథ చెప్పారు .

సాధారణంగా మనం ఎవరి గురించి గొప్పగా దృశ్యమానంగా చూపిస్తే ఓహో ఇతను ఇంత మంచి వాడా? ఇంత గొప్పవాడా అనిపించక మానదు. ఒక స్త్రీ పట్ల మోజు పెంచుకుని, కామప్రకోపంతో సీతను చెరబట్టిన రావణుడు తన పతనాన్ని కోరుకున్నాడు- అని వాల్మీకి రామాయణంలో విభీషణుడు, మండోదరి, చివరికి కుంభకర్ణుడు కూడా అంటారు.

అదీగాక ఉత్తరకాండలో రావణుడి పుట్టుక, ఆయన అరాచకాలు రాముడికి అగస్త్యుడు చెప్తాడు. కోడలి వరస అయిన రంభను మానభంగం చేసి నలకూబరుడు అనే వాడి చేత శపించబడతాడు. వేదవతి శిరోజాలను పట్టుకుంటాడు, పుంజకస్థల అనే ఆమెను అనుభవిస్తాడు. కానీ ఈ సినిమాలో స్త్రీలను తాకని మహా గొప్పవాడిగా పోర్ట్రైట్ చేసాడు దర్శకుడు. అలాగే కుబేరుడు రావణుడికి అన్న వరస అవుతాడు. (విశ్రవసుడు మొదటి భార్య కొడుకు) బ్రహ్మవరం వలన లంకలో ఉంటాడు. ఆయనతో కూడి దేవతలు అందరూ రావణ పరివారాన్ని, రాక్షస జాతిని కించపరిచినట్టుగా చూపించాడు దర్శకుడు.

మునుల, స్త్రీల వలన శాపాలు పొందుతున్నాడని రావణుడి మీద జాలిపడి కుబేరుడే రావణుడిని ప్రేమకొద్దీ సరిదిద్దే ప్రయత్నం చేస్తాడు. దూత చేత సందేశం పంపిస్తాడు. రావణుడు ఆ దూతను చంపిస్తాడు. ఇలాంటి వాణ్ని బాగా ఎత్తి చూపించి యువతకు రావణుడు అంటే హీరోవర్షిప్ కలిగేలా చేసిన ప్రయత్నం ఎంతవరకూ సమంజసం? అలాగే రాక్షసుల నివాస స్థలం పాతాళం. బలి చక్రవర్తి కూడా అక్కడే ఉంటాడు. ఈ సినిమాలో వాళ్ళు ఎదో కష్టాలు పడిపోతున్నట్టు చూపించడం ఏమిటో?

కథనంలో ఆత్మ మృగ్యం

రామాయణం లాంటి ఆది కావ్యం సినిమాలో ఇమడ్చడం అంత సులువుకాదు. (కానీ మన వాళ్ళు అందుకే కొన్ని పాటల ద్వారా దేన్నీ కోల్పోకుండా చక్కగా తీసారు. ముఖ్యంగా బాపు సంపూర్ణ రామాయణం సినిమా ).
రామాయణ ఇతిహాసంలో ముఖ్యమైనవి కథామలుపులు. అవే గొప్ప బలం. వాటిలో ఆర్ద్రత, ప్రేమ, బంధాలు, దుఃఖం ఇమిడి ఉంటాయి. వాటి వలెనే రామాయణం గొప్ప కావ్య లక్షణాలు కలిగి ఆదికావ్యంగా పేరు పొందింది. అందుకే ఇన్ని లక్షల సంవత్సరాలు అయినా మనం అక్కున చేర్చుకుంటూనే ఉన్నాము.

సినిమా విషయానికి వస్తే- బాల్యంలో విశ్వామిత్రుడి సిద్దాశ్రం ఘట్టం అస్సలు బాగా తీయలేదు. బల , అతిబల అనే విద్యలు, అస్త్రాలు ఇస్తున్నట్టుగా, యాగం రక్షిస్తున్నట్టుగా, మునివాటిక సరిగా చూపించలేదు. మరీ విచిత్రం (మారీచుడు మానావాస్త్రం దెబ్బకి కొన్ని యోజనాల దూరంలో పడతాడు). ఇక్కడ సినిమాలో పాము రూపంలో మారి మాయమవుతాడు., అది మరి ఏ రామాయణంలో ఉందో తెలియదు. ముఖ్యమైన మారీచుడి పాత్ర కూడా అంతంత మాత్రం. అలాగే పట్టాభిషేక సన్నివేశం జరిగే ముందు కైక, దశరథలు సంవాదనలు బలమైనవి. అవి కూడా పక్కన పెట్టాడు. మరో మలుపు రాముడు గుహుడి సంవాదన తీసేసాడు. భరతుడి ఆవేదన, ప్రేమ, ఆయనను ఒప్పించడానికి చేసే ప్రయత్నంలో కాసిని మంచి మాటలు చెప్పించి నటింప చేయలేకపోయాడు దర్శకుడు. అది పేలవంగా ముగిసిపోయింది. అలాగే సీతాపహరణ ఘట్టంలో రావణుడు ఆమెని ఎత్తుకుని రథంలో ఎక్కించుకుని ఆకాశంలోకి ఎగిరిపోయే సన్నివేశం తీయలేదు. (ఆయన ముట్టుకుంటే ఏమీ జరగదు. ఆయన అనుభవించడానికి ప్రయత్నిస్తే మరణిస్తాడు అనే శాపం ఉంటుంది) ఇలా చూపడానికి కారణం రావణుడికి స్త్రీల పట్ల గొప్ప గౌరవం ఉందని భావన కలిగించడానికా? అసలు రావణుడు చావుకి మూల కారణం, సీత అతిలోక సౌందర్యవతి అని ఆమెను వర్ణిస్తూ అన్నను శూర్ఫణఖ రెచ్చకొడుతుంది, అప్పుడు ఆమె మీద మోజు పెరిగి అపహరించడానికి వెడతాడు. సీతకన్నా నేను బావుండనా నేను ఉండగా సీత ఎందుకు అని ధాన్యమాలి అనే అతని మరో భార్య అంటుంది కూడా (వాల్మీకి రామాయణం). ఇలా రామాయణంలో ఉన్న బలమైన సన్నివేశాలను తీయకుండా, విజువల్ గ్రాండీయర్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు దర్శకుడు. దానివలన రామాయణంలో ఆత్మ మృగ్యం అయిపోయింది. ఒక మార్వల్ సినిమాగా మారింది.

అలాగే చాలామంది రాముడు కొన్ని యుద్ధ సన్నివేశాల్లో వెనుకంజ వేసినట్టు చూపించడం నచ్చలేదు అని వ్రాసారు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే. రాముడు తాను మామూలు మనిషి. భగవంతుడి అవతారం అనే ఆలోచన మనస్సులోకి రాకూడదు. అలాఉంటేనే ఆయన మహా తపస్సంపన్నుడైన, బలశాలి అయిన రావణుడిని చంపగలడు. అందుకనే పరిణామ క్రమంలో విశ్వామిత్రుడిచ్చిన అస్త్ర బలం, అగస్త్యుడు ఇచ్చిన ధనుస్సు, అక్షయతూణీరాలు. ఆదిత్య హృదయం, హనుమ సాయం, ఇంద్రుడు పంపిన రథం, ఇన్ని చేకూరాకా అయన రావణుడిని వధించాడు. అందుకే చివర యుద్ధ భూమిలో దేవతలు వచ్చినా కూడా అయన తాను మనిషినే అనే చెప్తాడు తప్ప ఎక్కడా తాను విష్ణువు అవతారం అని చెప్పలేదు. కాబట్టి యుద్ధ సన్నివేశాలు విషయంలో దర్శకుడిని తప్పుబట్టక్కర్లేదు.

కానీ ఖర దూషణుల యుద్ధంలో, పద్నాలుగు వేలమంది రాక్షసులను సార్థముహూర్త కాలంలో (ఒక గంటా పన్నెండు నిముషాలలో) చంపేసిన మహావీరుడు రాముడు. అప్పుడు సీత లక్ష్మణుడు గుహలో దాక్కొంటారు. ఇక్కడ సీతకూడా యుద్ధం చేస్తుంది. ఇది జెన్ జీ ఆడపిల్లల కోసం క్రియేట్ చేసాడు అనుకోవాలి.

ఇంక ఈ సినిమాలో చెప్పుగోదగిన విషయాలు ఏమిటంటే. రాముడిగా వేసిన రణబీర్ కపూర్ నటన బాగానే ఉంది. అతని విగ్రహం బావుంది. సీతగా సాయిపల్లవి డైలాగ్సు పర్వాలేదు గాని ఆకర్షణీయంగా లేదు. రావణుడిగా యష్ అదరగొట్టాడు. మిగిలిన పాత్రలు హత్తుకునేలా లేవు. ముందు పూర్తిగా నిరాశ పరిచింది సంగీతం. BGM లో ఏవో శ్లోకాలు పెట్టారు అవి అసలు వినబడలేదు. పాటలు మంచివి చేయించుకోలేకపోయారు. అవి ఉంటె కొంత కళ కట్టేది. జిమ్మర్ బాగా కొట్టాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల్లో.

పెద్ద కథా లోపం ఏమిటంటే, జటాయువు రాముడికి సీతను రావణుడు లంకకి తీసుకువెళ్లి పోయాడు అని చెప్పించాడు. అది శుద్ధ తప్పు. జటాయువు రావణుడు సీతను దక్షిణ దిక్కుకి తీసుకుపోయాడు అనే చెప్పి మరణిస్తాడు. తర్వాత సుగ్రీవుడు వానరులను అన్ని దిక్కులకు పంపుతాడు సీత జాడకోసం. హనుమ దక్షిణ దిక్కుకి వెళ్లి సంపాతి చెప్పిన గుర్తుల వలన సీతను కనుగొంటాడు. జటాయువు చెప్పేస్తే సీతాన్వేషణలో రాముడు ముందే లంకకు వెళ్లిపోవచ్చు కదా అందర్నీ కూడగట్టుకుని. ఇదో పెద్ద లోపం. అలాగే అనసూయ చీర, ఆభరణాలు, మంచి సువాసన కలిగే తైలం ఇస్తుంది. అది అగస్త్యుడి సన్నివేశంలో కలిపెసాడు. అందరూ అగస్త్యుడి భార్య అనసూయ అనుకునే ప్రమాదం ఉంది. ఆమె అత్రి మహర్షి భార్య.

ఇన్ని లోపాలు ఉన్నా, రామాయణం అనే పేరు ఉంది కనుక, రామాయణంఅన్నా, సీతారాముల ప్రేమ మనకి ఎంతో ఉంది కనుక ఈ సినిమా VFX కోసం చూడవచ్చు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి.

మా మిత్రులు మంచి రచయత ఆకెళ్ళ శివప్రసాద్ గారు తెలుగు సంభాషణలు చాలా బాగా వ్రాసారు. ఆయనకి అభినందనలు.

మన పురాణాలు ఇలా టెక్నికల్ గా అంతర్జాతీయ స్థాయిలో చూపించడం చాల గ్రేట్. మరియు గర్వకారణం. కానీ మన అస్తిత్వం అయిన గొప్ప ఇతిహాసమైన రామయణం ఇలా చూపిస్తే జెన్ జీ లు ఇదే నిజమైన రామాయణం అనుకునే ప్రమాదం ఉంది. నాకు మటుకు చాలా బాధ కలిగింది.

అందుకనే మేము నాలుగేళ్ళు కష్టపడి మూల భారతం, రామాయణం ఉన్నది ఉన్నట్టుగా మా లిపి యాప్ లో పొందుపరిచి ఆడియో, విడియో, నెట్వర్క్ గ్రాఫ్స్ ద్వారా అందరికీ అర్థం అయ్యే తెలుగు, ఇంగ్లిష్, హిందీలలో పొందుపరిచాము. మన యువతకు, పిల్లలకి నిజమైన ఇతిహాసాలు చెప్పాలనే మా ప్రయత్నం.

జై శ్రీరామ్.
స్వస్తి.

– చాగంటి ప్రసాద్,
డైరెక్టర్ -కంటెంట్ రైటర్ లిపి ఎపిక్స్ అండ్ గేమ్స్
Please download
https://lipi.game/download-app

Tags: chaganti prasadramayan reviewramayanam movie reviewచాగంటి ప్రసాద్రామాయణం రివ్యూరామాయణ్ రివ్యూ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

భూక్యా గోపి నాయక్ కథ : ఖాకీ ఆకు

11.10.26 కథానిధి సమీక్ష: మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనాలు

18.10.26 కథానిధి సమీక్ష: జీవన వైవిధ్యపు అక్షర దర్పణాలు

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply