మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో జరుగు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవంలో బాల్యవివాహాలను నిర్మూలించాలంటూ శ్రీకాళహస్తిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీని ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద నుండి శ్రీకాళహస్తి డి ఎస్ పి విశ్వనాధ్ జండా ప్రారంభించారు.
అలాగే ఈ ర్యాలీ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, బాలుర గిరిజన సంక్షేమ పాఠశాల, బాబు అగ్రహారం, సరస్వతీ భాయి మున్సిపల్ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొని బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ నినాదాలు చేస్తూ, ప్లే కార్డులను చేత పట్టుకొని శ్రీకాళహస్తి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డి ఎస్ పి విశ్వనాధ్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, అలా ఎవరైనా నా చేస్తే, ప్రోస్తాహిoచిన వారిపై కఠిన చర్యలు అనగా రెండు సంవత్సరాలు, లక్ష రూపాయలు జరిమానా, జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు.
శ్రీకాళహస్తి పరిసర గ్రామీణ ప్రాంతాలలో పోలీస్ మొబైల్ వాహనాలు ద్వారా ప్రచారం నిర్వహించి, ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమములో రాష్ట్ర గైడ్స్ కౌన్సిల్ ముజీ మెంబర్ టి. రమేష్ బాబు, రాష్ట్ర ఏ ఎస్ ఓ సి కోటేశ్వర రావు, జయరాం, స్కౌట్ మాస్టర్ శ్రీనివాసరావు,కార్యాలయ కమిషన్ మునేంద్ర రెడ్డి, కో-ఆర్డినేటర్ ఉమేష్ రావు , గైడ్ కెప్టెన్సీ నిర్మల, పద్మావతి,మంజుల, రాధికా, సులోచన ,నిర్మల …. తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post