గుంటూరులో ఈ నెల 6,7,8వ తేదీల్లో జరిగే ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ ఏరియా కార్యదర్శి జనమాల గురవయ్య విజ్ఞప్తి చేశారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని ఎఫ్ సీఐ గోదాంలో గురువారం మహాసభల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం పూరించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల కాపాడుకోవాలని.. అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై సమరశంఖం పూరించాలని పిలుపు నిచ్చారు.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర మహాసభలను జయప్రధం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి వై ఎస్ మణి, నియోజకవర నాయకులు అయ్యప్ప, దయాకర్ నాయుడు, సీపీఐ నాయకులు రొడ్డా గోపి, రేణిగుంట మండల కార్యదర్శి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post