సాధారణ పాఠ్యబోధనకు భిన్నంగా సాంకేతిక పరిజ్జానాన్ని ఉపయోగించుకుని డిజిటల్ కంటెంట్ వైపు మరలాల్చిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానోపాధ్యాయులు సురేష్ అన్నారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ‘డిజిటల్ కంటెంట్ మేకింగ్’ పై ఒకరోజు శిక్షణ జరిగింది.
ఈ శిక్షణకు శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కేవీబీపురం, బీఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం ,సత్యవేడు మండలాల ఎంపికైన ఉపాధ్యాయులు హాజరై డిజిటల్ కంటెంట్ లో భాగంగా వివిధ యాప్ లు వినియోగం, యానిమేషనన్స్, క్విజ్, వీడియో మేకింగ్, పిపిటీలు తయారీ తదితర అంశాలపై శిక్షణలో నేర్చుకున్నారు.
ఇటీవల ఢిల్లీలో ఐ.సి.టి విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కూనాటి సురేష్ ను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో విషయ నిపుణులు యువశ్రీ మురళి, బాబులాల్, మేఘనాథ్, తస్లీమా లతో పాటు ఆ పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయులు శివకుమార్, ఆరు మండలాల నుంచి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
.
Discussion about this post