చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి వాస్తవ్యురాలైన శ్రీమతి గురులక్ష్మి కోలా కు బయోటెక్నాలజీ విభాగంలో పరిశోధన చేసినందుకు గాను కడప జిల్లా లోని యోగి వేమన విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది.
యోగి వేమన విశ్వవిద్యాలయం, బయోటెక్నాలజీ విభాగం, సహ ఆచార్యులు (అసోసియేట్ ప్రొఫెసర్) డా.ఎ.చంద్రశేఖర్ గారి పర్యవేక్షణలో “సీడ్ మైక్రోనూట్రియంట్ ప్రొఫైలింగ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎఫిషియెంట్ రీజనరేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రోటోకాల్ ఆఫ్ ఫాక్సటైల్ మిల్లెట్ (సెటారియా ఇటాలిక్ ఎల్.) లాండ్రేసిస్ అండ్ రిలీజడ్ కల్టీవర్స్ అనే అంశంపై పరిశోధన చేసి, యోగి వేమన విశ్వవిద్యాలయం కు పరిశోధన గ్రంథం సమర్పించడం జరిగింది.
గురులక్ష్మి సమర్పించిన పరిశోధన గ్రంధాన్ని పరిశీలించి, మదింపు చేసిన అనంతరం ఈనెల ఏడవ తేదీన యోగి వేమన విశ్వవిద్యాలయం లోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఆచార్యులు మరియు ఇతర పరిశోధకులు గురులక్ష్మి ను ముఖాముఖి ప్రశ్నలు అడిగి, సంతృప్తికర సమాధానాలు వచ్చిన తరువాత, పై ముఖాముఖి కార్యక్రమం సంతృప్తికరంగా ముగిసిన తరువాత, బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ గురులక్ష్మి కి డాక్టరేట్ ప్రదానం చేయవలసిందిగా యోగి వేమన విశ్వవిద్యాలయానికి సిఫారసు చేయడం జరిగింది.
బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్స్ యొక్క సూచనలను పరిగణనలోకి తీసుకొని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి వారు శ్రీమతి గురులక్ష్మి కోలా కు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు ధృవీకరిస్తూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు నోటిఫికేషన్ జారీ చేశారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం నుండి బయోటెక్నాలజీ విభాగంలో డాక్టరేట్ పొందడం చాలా ఆనందంగా ఉన్నదని, అలాగే ఈ పరిశోధన చేయడానికి తనను ఎంతగానో ప్రోత్సహించిన యోగి వేమన విశ్వవిద్యాలయం, వృక్ష శాస్త్ర సహ ఆచార్యులు డా. పి.చంద్ర ఓబుల్ రెడ్డి గారికి, బయోటెక్నాలజీ విభాగం ఆచార్యులు మరియు ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు గురులక్ష్మి తెలిపారు.
.
Discussion about this post