గురువారం రోజు జరిగిన ఎంజీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని ,విద్యార్థులకు ఆరోగ్య అవగాహన సదస్సు శ్రీకాళహస్తి ఎంజీఎం స్కూల్ నందు నిర్వహించారు.
దాదాపు 350 మంది ఎంజీఎం స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్యం గురించి అవగాహన కల్పించారు.
ప్రత్యేకంగా చిన్న పిల్లల డాక్టర్లు చే వైద్య పరీక్షలు నిర్వహించి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు.
పై కార్యక్రమంలో ఎంజీఎం హాస్పిటల్ డైరెక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి లోని ప్రతి పాఠశాల నందు వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థినీ, విద్యార్థులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వ తలచామని ఇందులో భాగంగా ఈ రోజు ఎంజీఎం సంస్థలో భాగమైన ఎంజీఎం స్కూల్ నందు నిర్వహించామని తెలిపారు.
విద్యార్థులపై తగు ప్రత్యేక శ్రద్ధతో వైద్యపరీక్షలు చేయించిన ఎంజీఎం స్కూల్ యజమాన్యం వారికి స్కూల్ పిల్లలు యొక్క తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే శ్రీకాళహస్తిలో ప్రతి పాఠశాల వారు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్న ఎంజీఎం హాస్పిటల్ వారికి ఎంజీఎం స్కూల్ విద్యార్థిని ,విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు.
పై కార్యక్రమంలో ఎంజీఎం హాస్పిటల్ డాక్టర్లు,ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు మరియు నర్సులు సిబ్బంది పాల్గొన్నారు.
.
Discussion about this post