రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశించిన బడ్జెట్ లో గాండ్ల తేలి కులాల కార్పొరేషన్ కు కనీసం చిల్లిగవ్వ,అణా పైసా కూడా చెల్లించక పోవడం చాలా అవమానకరంగా గాండ్ల తెలికుల ప్రజలు, గానుగ కులవృత్తి దారులు బావిస్తున్నారని అఖిల గాండ్ల,తెలికుల సంక్షేమ మహా సంఘం ద్వారా రాష్ట్ర ప్రచార కార్యదర్శి కన్నావరం హరిబాబు పత్రికముఖంగా తెలిపారు
అణగారిన వర్గాల గాండ్ల కులాలుగా,కనుమరగయ్యే గానుగ కులవృత్తిని ఆదుకునే ఉద్దేశం తో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కు నామమాత్రపు పదవులను కేటాయించి సరైన నిధులను ఇవ్వకపోవడం అత్యంత భాదాకరంగా ఉందని గాండ్ల తెలికుల ప్రజలు వాపోతున్నారు.
ఏళ్లక్రితం ప్రారంబించిన బీసి కులాల కార్పొరేషన్ కి కాదని కొత్తగా ఏర్పాటు చేసిన ఆదిపత్య కులాల కార్పొరేషన్ కి పెద్దమొత్తంలో బడ్జెట్ ని కేటాయించడం ద్వారా ప్రభుత్వం చూపుతున్న బీసిలపై కపట ప్రేమ తేటతెల్లమవుతున్నదని కన్నావరం హరిబాబు తెలిపారు.
ఇప్పటికైనా సరే ప్రభుత్వం తన కఠిన వైఖరిని మార్చుకుని గాండ్ల తెలికుల కార్పొరేషన్ కి రెండువేల కోట్లు కేటాయించి గానుగ కులవృత్తి ని, కులం లోని పేద ప్రజలకి , విద్యార్దులను,కులవృత్తి దారులను ఆదుకోవాలని కోరారు.లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కులాన్ని సంఘటిత పరచి పెద్ద ఉద్యమాన్ని నడుపుతామని ప్రభుత్వానికి పత్రికముఖంగా తెలిపారు.
.
Discussion about this post