పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ సారా మరణాలపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ.. ఈ వ్యవహారం పై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అంజూరు చక్రధర్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంపూర్ణ మద్యనిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాట తప్పి.. సొంత బ్రాండ్లు దించి ప్రజల్ని దండుకోవడంతోనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
కల్తీ సారా మరణాలను ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. కల్తీ సారాతో 26మంది చనిపోతే ప్రభుత్వంలో కనీసం చలనం లేక పోవడం బాధాకరమన్నారు.
సారా మరణాలపై న్యాయ విచారణ చేసి… ఒక్కో మృతుని కుటుంబానికి 25లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అంజూరు చక్రధర్ జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు.
.
Discussion about this post