జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేరుద్దామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏపీసీడ్స్ వద్ద సోమవారం శ్రీకాళహస్తిలో జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పూలే చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి మరువలేనిదన్నారు.
పూలే కృషి ఫలితంగానే నేటి సమాజంలో బలహీన వర్గాలకు కొంతమేరైనా న్యాయం జరుగుతోందన్నారు. రాజ్యాధికారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా వెనుకబడిన తరగతుల వారు ఏకం కావాల్సిన అవసరం ఉందని బాలాజీ ప్రసాద్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇక శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చొరవతో త్వరలోనే ఏపీ సీడ్స్ కూడలినందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహప్రతిష్ట నిర్వహిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ప్రముఖ లాయర్ సురేంద్ర ముదిరాజ్, పుల్లయ్య, ఏపీ సీడ్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ రెడ్డి, మున్నయ్య, ముని కృష్ణారెడ్డి, లోకనాథం యాదవ్, మోహన్, గణేష్ మొదలియార్, రాజా గౌడ్, మునిరామ రెడ్డి, చెంగల్రాయులు, రవి, తదితరులు పాల్గొన్నారు.
.