జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయమని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు. శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేట ప్రాధమికోన్నత పాఠశాలలో ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 196వ జయంతి వేడుకలు ఘనంగా చేశారు.
ఈ సందర్భగా పూలే చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రధానోపాధ్యాయులు ఈశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు గజేంద్రకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ తెలుగుమహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే బడుగు బలహీన అణగారిన వర్గాల అభివృధికి ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యంగా స్త్రీ విద్యకోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు.
సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలు అసమానతలు తొలగించడానికి ఎంతో కృషి చేశారని ఆమె చెప్పారు. సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఆయన పని చేశారని కొనియాడారు. జ్యోతిరావు పూలే జీవితం ఈ దేశ ప్రజలకు ఆదర్శమని.. వారి ఆశయాన్ని మనమందరం ముందుకు తీసుకుపోవడమే వారికిచ్చే గణమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ బృందం భారతి, హేమలత, విజయ, జయలక్ష్మి, షాకీరా, హేమ, జ్ఞానేష్ రాయల్ పాల్గొన్నారు.
.