మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేద్దామని సీపీఎం పట్టణ కార్యదర్శి గంధం మణి పిలుపునిచ్చారు. పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించారు.
పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంధం మణి మాట్లాడుతూ… సమాజంలో అందరికీ విద్య.. అందరూ సమానంగా జీవించే హక్కు.. కులవివక్షతకు వ్యతిరేకంగా జ్యోతిరావు పూలే పోరాటం చేశారన్నారు.
ముఖ్యంగా స్త్రీ విద్య పట్ల పట్టుదలతో తన భార్యకు చదువు నేర్పించి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది బాలికలకు పాఠశాల ఏర్పాటు చేయించారని తెలిపారు.
అటువంటి మహానుభావుని యొక్క ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం జ్యోతిరావు పూలేను కొంతమంది కుల సంఘాల కే పరిమితం చేయడం సిగ్గుచేటన్నారు.
జ్యోతిరావు పూలే జాతి గర్వించదగ్గ అందరికీ సంబంధించిన నాయకుడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఈశ్వరయ్య, వెళ్లి వేంద్రం, అన్వర్ భాషా, ఉస్మాన్ భాష, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
.