శ్రీకాళహస్తిలోని ఆదర్శిని భారతమ్మ ఎల్లయ్య ట్రస్టు ఆధ్వర్యంలో ఆర్పీబీఎస్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వివేకానందుడి జీవితంపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బహుమతి ప్రదానం చేశారు.
ఎమ్మెల్యే వెంకటసుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైఫల్యాలకు కుంగిపోకుండా ముందుకు సాగితే విజయం దక్కుతుందనడానికి తన జీవితమే ఉదాహరణ అని విద్యార్థులకు తెలియజెప్పారు.
ట్రస్టు అధ్యక్షులు మునిసురేష్ పిళ్లె మాట్లాడుతూ.. వివేకానందుడి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుందని చెప్పారు. వివేకానందుడి గుణగణాలు, వ్యక్తిత్వ విశేషాలు ప్రతి విద్యార్థికి తెలియాలనే ఉద్దేశంతో రామక్రిష్ణ మిషన్ వారు ప్రచురించిన ‘స్వామి వివేకానంద జీవితం- సందేశం’ పుస్తకాన్ని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివి ప్రతివిద్యార్థికి ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పారు. అదే పుస్తకంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు ఇస్తున్నట్టు వివరించారు.
వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో బహుమతులు సాధించిన విద్యార్థులు మధుమిత, గేయని, మోక్షిత, హారిక, జాహ్నవి, యామిని, సన్నీ, శ్రీధర్, హేమంత్ లకు ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి, ట్రస్టు అధ్యక్షులు కె.ఎ. మునిసురేష్ పిళ్లె బహుమతులు అందజేశారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె.రాజేశ్వరి, పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ కె.విమల, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సురేష్ బాబు, శివకుమార్, ప్రభావతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.



.

Discussion about this post